Puneeth Rajkumar: మహిళలలో ఆత్మవిశ్వాసం కోసమే శక్తిధామ.. పునీత్ రాజ్‌కుమార్ సేవలలో ఒక మైలురాయి..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: కేవలం సినీ కెరీర్ మాత్రమే ఒక నటుడికి అంతమంది అభిమానులను తెచ్చిపెట్టడం కష్టమే. పునీత్ రాజ్‌కుమార్‌కు కేవలం కర్ణాటక ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా అంతమంది అభిమానులు ఉండడానికి ఆయన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కూడా కారణం. శాండల్‌వుడ్ ఎన్ని తరాలైనా మర్చిపోలేని నటుడిగా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ వారసుడు పునీత్.. ఎన్నో సేవ కార్యక్రమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అందులో ఒకటి 'శక్తిధామ'.
చాలామంది హీరోలు తమ అభిమానులకు, ప్రేక్షకులకు హెల్ప్ చేయడానికి సొంతంగా ట్రస్ట్‌లను స్థాపించారు. కానీ అందులో శక్తిధామా కొంచెం ఢిఫరెంట్. కేవలం నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడడానికే శక్తిధామ మొదలయ్యింది. మహిళలు కూడా ఎవరు సహాయం కోసం ఎదురుచూడకుండా సమాజంలో ఒంటరిగా బ్రతకగలగాలి అన్న లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు పునీత్ రాజ్‌కుమార్.
శారీరికంగా, మానసికంగా మహిళలను ఇంకా ధృడపరచడానికి శక్తిధామ పనిచేస్తోంది. పునీత్ రాజ్‌కుమార్ ఈ ట్రస్ట్ విషయాలన్నీ పర్సనల్‌గా చూసుకునేవారు. అసలైతే ఈ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టింది రాజ్‌కుమార్ భార్య, పునీత్ రాజ్‌కుమార్ అమ్మ పార్వతమ్మ రాజ్‌కుమార్. ఆయన మరణానంతరం ట్రస్ట్ బాధ్యతలను పూర్తిగా తానే స్వీకరించారు పునీత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com