Ashwini Puneeth: అలా చేసి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు.. పునీత్ అభిమానులకి అశ్విని రిక్వెస్ట్..!

Ashwini Puneeth: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం అభిమానులను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.. ఈ షాక్ నుంచి ఇంకా బయటకు రావడం లేదు.. గుండెపోటుతో చిన్న వయసులోనే పునీత్ చనిపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.. దీనితో పలువురు అభిమానులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. సుమారుగా 12మంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దీనిపైన పునీత్ భార్య అశ్విని స్పందించారు. 'పునీత్ మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు.. ఇలాంటి సమయంలో అభిమానులు చూపిస్తున్న ప్రేమకి ఎప్పటికి రుణపడి ఉంటాము.. పునీత్ మన మధ్య లేకపోయినప్పటికీ మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కుటుంబాలను ఒంటరి చేయొద్దు " అని ఓ ప్రకటనలో తెలిపారు. అటు పునీత్ సోదరులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్రలు కూడా అభిమానులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com