పూరీ పుట్టినరోజు స్పెషల్.. డబుల్ ఇస్మార్ట్ ప్రత్యేక పోస్టర్

ఈరోజు దర్శకుడు పూరీ జగన్నాధ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ, అతని తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, విలన్ సంజయ్ దత్‌లతో కలిసి ఉన్న ప్రత్యేక పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
పూరి తన పుట్టినరోజును తన సినిమాలోని ఇద్దరు ప్రధాన వ్యక్తులతో ఘనంగా జరుపుకున్నాడు. వాళ్లంతా చేతుల్లో తుపాకులతో కనిపిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్ వైబ్రెంట్‌గా కనిపిస్తున్నందున ఇది ఒక పాటకు సంబంధించనదై ఉంటుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. రామ్, సంజయ్ దత్ ఒకే రకమైన దుస్తులు ధరించారు.
పూరి జగన్నాధ్ తన భారీ హిట్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com