సినిమా

'పర్‌ఫెక్ట్‌ భర్త'పూరీ జగన్నాథ్..

పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందే.

పర్‌ఫెక్ట్‌ భర్తపూరీ జగన్నాథ్..
X

భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలనుకోవడం కొంచెం అత్యాశేనేమో.. మరీ శ్రీకృష్ణుడిలా ఉండకుంటే చాలేమో.. అదే విషయాన్ని డైరక్టర్ పూరీ జగన్నాథ్ అమ్మాయిలకు ఉపదేశిస్తున్నారు.. పెళ్లంటేనే సర్ధుకుపోవడం.. అన్నింటా 'పర్‌ఫెక్ట్‌ భర్త'అంటే కష్టమంటున్నారు.. కాబోయే భర్త గురించి కలల్లో విహరించకుండా వాస్తవ దృష్టితో చూడాలంటున్నారు.

పూరీ మ్యూజింగ్స్ల్ లో తన అనుభవాలతో పాటు ఫ్యాన్స్ కి పనికొచ్చే అంశాలు పంచుకుంటున్నారు.. తాజా టాపిక్.. 'పర్‌ఫెక్ట్‌ భర్త'.. అమ్మాయిలకు కాబోయే భర్త గురించిన అంచనాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని గీతోపదేశం చేస్తున్నారు.

నా భర్త ఇలానే ఉండాలి అనుకుంటే సమస్యల్లో చిక్కుకున్నట్లే అని అంటున్నారు. పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందే. జీవితంలో మిమ్మల్ని చాలా మంది ఏడిపిస్తుంటారు. కానీ ఎక్కువగా ఏడిపించే అవకాశం, అదృష్టం మీ భర్తకే దక్కుతుంది. ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు. చెప్పి కొన్ని, చెప్పక కొన్ని చేస్తాడు. దాంతో మీకు కోపం వస్తుంది. అందులో తప్పు లేదు.. కానీ మీ నాన్న కూడా అవే తప్పులు చేస్తాడు.

ఆ విషయం గురించి అమ్మ ఎన్ని సార్లు ఏడ్చి ఉంటుందో గుర్తుకు తెచ్చుకోండి. మరి మీ నాన్నను క్షమించినట్లే మీ భర్తను కూడా క్షమించి వదిలేయొచ్చుగా.. పక్కింటి వాళ్ల మాటలు పట్టించుకుని మీ భర్తతో గొడవపడొద్దు. భర్త ఎంత గొప్పవాడైతే భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయి. మగవాళ్లు మంచి వాళ్లు కాదు.. అలా అని చెడ్డవాళ్లూ కాదు.. పెళ్లంటేనే సర్ధుకుపోవడం అంతే అని పూరీ వివరించారు.

Next Story

RELATED STORIES