ఆ దర్శకుల బాటలో పూరీ, హరీష్.. ఇక డైరెక్షన్ వదిలేస్తారా
రెండు సినిమాలు.. ఇద్దరు దర్శకుల ఫేట్ ను దారుణంగా మార్చేసింది. నిజానికి ఈ మూవీస్ విడుదలకు ముందు ఇద్దరి మధ్య ఇన్ డైరెక్ట్ గా ఓ వార్ నడిచింది. తను శిష్యుడులా భావించినవాడే తనకు వెన్ను పోటు పొడిచాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఫీలయ్యాడంటూ వార్తలు వచ్చాయి. గురువైతే ఏంటీ.. రిలీజ్ అనేది నిర్మాతల నిర్ణయం కదా.. ఈ మాత్రం తెలియదా అని అతని ఫీలింగ్ ను హరీష్ లైట్ తీసుకున్నాడు అనే న్యూస్ కూడా వినిపించాయి. హరీష్ అయితే అనేశాడు కూడా. ఫైనల్ ఇద్దరి సినిమాలు డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్.. ఇండిపెండెన్స్ డే రోజు విడుదలయ్యాయి. మొదటి ఆటతోనే డిజాస్టర్స్ గా తేలిపోయాయి. అంతకు ముందు పూరీ జగన్నాథ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సిట్యుయేషన్ లో కూడా ఏ మాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో వీలైనంత ఎక్కువగా విసిగించాడు. ఇక హరీష్ శంకర్ చెప్పేది నీతులు, చూపేది ఇంకేవో అన్నట్టుగా చేశాడు. మొత్తంగా వీరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ అనే ప్రశ్నకు ఆన్సర్స్ ఉన్నాయి కానీ.. నిజంగా అవి పట్టాలెక్కుతాయా అనే ప్రశ్నలూ ఉన్నాయి.
హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ రామ్ తో అన్నాడు. రామ్ డబుల్ ఇస్మార్ట్ తో డిజాస్టర్ చూశాడు. ఇది అతనికి వరుసగా నాలుగో డిజాస్టర్. అటు హరీష్ కెరీర్ లోనే బిగ్ డిజాస్టర్ చూశాడు. సో.. ఇప్పుడు రామ్ మళ్లీ రిస్క్ చేస్తాడు అనుకోలేం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది హరీష్ కు. ఆ మూవీ టీజర్, గ్లింప్స్ లాంటివి చూసినప్పుడే చాలామంది డౌట్ పడ్డారు. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. పైగా అది కూడా రీమేకే. అలాగే హరీష్ తన మార్క్ రీమేక్ అన్నాడు. ఆ మార్క్ ఏంటో బచ్చన్ లో చూశారు కాబట్టి.. ఉస్తాద్ వచ్చినా.. రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేసుకోవచ్చు.
ఇక పూరీ జగన్నాథ్ కైతే తను తప్ప మరో నిర్మాత దొరికే పరిస్థితి లేదు. కానీ తన వద్ద ఉన్నదంతా ఊడ్చేసినట్టే అని తేలిపోయింది కదా. అందుకే ఈ ఇద్దరు దర్శకులు త్వరలోనే ‘నటనా రంగంలోకి’అడుగుపెట్టబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దర్శకత్వంలో ఫెయిల్ అయినా నటులుగా కొత్త కెరీర్ వెదుక్కోవాలనుకుంటున్నారట. ఆల్రెడీ తమిళ్ లో గౌతమ్ మీనన్, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్లు సినిమాలు పోతున్నాయనే మొహానికి రంగేసుకుని నటించడం మొదలుపెట్టారు. ఈ దర్శకుల బాటలోనే పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్ వెళ్లాలనుకుంటున్నట్టు టాక్. ఇక ట్రయల్ లాగా పూరీ లాస్ట్ ఇయర్ గాడ్ ఫాదర్ లో కనిపించాడు. తన డైరెక్షన్ లో కనిపించడం వేరు.. వేరే వారి దర్శకత్వంలో ‘నటించడం’వేరు కదా.
ఇటు హరీష్ కూడా కెమెరా ముందు కూడా బాగా నటించగలడు అనే పేరుంది. అంచేత వీరి ఒరిజినల్ క్యారెక్టర్స్ కు తగ్గట్టుగా సినిమాల్లో వేషాలు వెదుక్కోవాలనుకుంటున్నారట. ఎలాగూ పూరీకి చాలమంది దర్శక అభిమానులున్నారు. వాళ్లు ఏదో మూవీలో ఒక వేషం ఇవ్వకపోరు. ఇటు హరీష్ పరిస్థితీ ఇంచు మించు అదే అవుతుందేమో. మరి దర్శకులుగా ఫెయిల్ అవుతున్న వీళ్లు నటులుగా బాగా రాణించాలని కోరుకుందాం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com