Puri Jagannadh: పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీద్దాం పదండి: అభిమాని లేఖ వైరల్

Puri Jagannadh: పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీద్దాం పదండి: అభిమాని లేఖ వైరల్
Puri Jagannadh: ఈ మధ్య ఆయన టైం బాగాలేదు. లైగర్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అట్టర్ ప్లాప్ అయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా డిస్ట్రిబ్యూటర్లు పూరీ పీకల మీద కూర్చున్నారు.

Puri Jagannadh: ఈ మధ్య ఆయన టైం బాగాలేదు. లైగర్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అట్టర్ ప్లాప్ అయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోగా డిస్ట్రిబ్యూటర్లు పూరీ పీకల మీద కూర్చున్నారు. డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ విషయాలన్నింటితో పూరీ జగన్నాథ్ బాగా డిస్ట్రబ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్‌ను కొంత గడువు కోరారు డబ్బు చెల్లించేందుకు. అయినా సదరు వ్యక్తి వినిపించుకోకుండా పూరీ ఆఫీసు ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


దీంతో తన పరువు తీసే ప్రయత్నాలు చేస్తే అస్సలు డబ్బు ఇచ్చేది లేదంటూ పూరీ వాయిస్‌తో రికార్డు చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఎవరో కావాలనే ఈ పని చేస్తున్నారని పూరీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ రాసి పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అయింది. ఆ లెటర్ సారాంశం ఒకసారి చూస్తే..

పూరీ గురించి ఈ లొల్లి ఏంది నాకర్థం కావట్లా.. పూరీ ఫ్యాన్‌గా కాదు ఓ ఆడియన్‌గా అడుగుతున్నా సమాధానం చెప్పండి..

అవును డాషింగ్ డైరెక్టర్ పూరీ నిజంగా ఓ మోసగాడు.. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చి ఇప్పుడు నలిగిపోతున్నాడు. ఖచ్చితంగా పరువు తీయాలి. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరికీ ఓ మార్క్ క్రియేట్ చేశాడు.. మోసగాడు అనే ముద్ర తప్పకుండా వేయాల్సిందే. దర్శకుడిగా, నిర్మాతగా వందల కోట్లు నష్టపోయినా ఎప్పుడూ ఎవరి పేర్లు బయటపెట్టలేదు. ఎవర్నీ బాధ్యుల్ని చేయలేదు. పల్లెత్తు మాట అనకుండా ఉన్నందుకు కుటుంబంతో సహా రోడ్డు మీదకు లాగాలి.

అవును .. తాను సమాజంలో పరువుగా బ్రతకాలని అనుకుని, ఇంతకాలం ఎవరి పరువు తీయకుండా ఉన్నందుకు బుద్దొచ్చేలా పరువు తీయాలి. తనను ఎంతో మంది మోసగించినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న పూరీ పరువు తీసి సత్కరించాలి అని తన లేఖలో రాసుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story