Puri Musings: అది నిజమైన ప్రేమ కాదు.. ఆలోచించండి: పూరీ జగన్నాథ్

Puri Musings: అది నిజమైన ప్రేమ కాదు.. ఆలోచించండి: పూరీ జగన్నాథ్
Puri Musings: టీనేజ్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడని వ్యక్తులు ఎవరూ ఉండరేమో.. సడెన్‌గా ఓ రోజు ప్రేమలో పడతాం.

Puri Musings: తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మెదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు అని పాడుకుంటున్నారా.. అస్సలొద్దు.. అవేవీ నిజం కాదు.. జస్ట్ శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్.. ప్రేమ, తొక్కా, తోలు అనే పదాలకు అర్థం లేదు.. ప్రేమ అనేది నిజమైన ఫీలింగ్ కాదంటున్నారు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో ప్రేమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టీనేజ్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడని వ్యక్తులు ఎవరూ ఉండరేమో.. సడెన్‌గా ఓ రోజు ప్రేమలో పడతాం.. ప్రేమించడం మొదలు పెడతాం.. ఐ లవ్యూ చెబుతాం.. విరహగీతాలు ఎన్నో రాస్తాం.. ఇంట్లో వాళ్లు అడ్డుపడతారు. చేతులు కోసుకుంటాం.. గోడ దూకుతాం.. ఇంట్లో నుంచి పారిపోతాం.. ఎవరు చెప్పినా వినం.. చేసేందేంలేక నాలుగు అక్షింతలు వేసి మీ చావు మీరు చావండి అంటారు.. ఇద్దరూ ఏకాంతంగా.. అదే క్లైమాక్స్ అనుకుంటాం..

కానీ కాదు.. అది సీన్ నెంబర్ వన్. ఆ తర్వాత ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి మోజు తీరిపోతుంది.. అందుకే చెబుతున్నాను. మనలో పుట్టే ప్రేమ అనే ఫీలింగ్ నిజం కాదు.. అది మన శరీరంలో జరిగే ఓ కెమికల్ రియాక్షన్. దానివల్ల మనలో యుఫోరియా కలుగుతుంది. దాన్నే మనం పవిత్రమైన ప్రేమ అనుకుంటాం. మనలో పుట్టే ప్రతి అనుభూతి కూడా కెమికల్స్, హార్మోన్ల వల్ల పుట్టినవే.. ప్రేమ ఒక్కటే కాదు మనలో కలిగే ఎన్నో అనుభూతులకు కెమికల్ రియాక్షన్సే కారణం.. మన మెదడు రిలీజ్ చేస్ హార్మోన్ల వల్లే ఇవన్నీ కలుగుతాయి అని అంటున్నారు పూరీ.

మన మెదడు సిరిటోరియన్ విడుదల చేస్తుంది. అది మనం నిద్రపోవడానికి లేదా కుంగుబాటుకు కారణం అవుతుంది. అలాగే డోపమైన్.. దీన్ని ప్రెజర్ కెమికల్ అని పిలుస్తారు. ఇక మనలో పుట్టే ప్రేమ లైంగిక ఆకర్షణ కారణంగా పుట్టిందే అని పూరీ తన మ్యూజింగ్స్‌లో వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story