Puri Jagannadh : పూరీ దారి ఎటు..?

Puri Jagannadh :  పూరీ దారి ఎటు..?
X

పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు డాషింగ్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ ఉన్నవాడు. అతని దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలని స్టార్ హీరోలు కూడా భావించేలా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. తెలుగు సినిమా హీరో 'క్యారెక్టర్'ను మార్చాడు. హీరోయిన్లను చీప్ గా చూపించినా జనం చేత జేజేలు కొట్టించుకున్నాడు. నెగెటివ్ టైటిల్స్ తో పాజిటివ్ రివ్యూస్ రాబట్టాడు. బద్రి, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. పోకిరి, బిజినెస్ మేన్.. ఇలా ఓ రేంజ్ లో సాగింది హవా. బట్.. పోకిరి తర్వాత మనోడు డాన్స్ కు గ్యాంగ్స్ స్టర్స్ కు మధ్య స్టక్ అయ్యాడు. కథల్లో మార్పులు లేవు. ఇంకా చెబితే ఒకప్పటి తేజలా తిప్పి తిప్పి అవే కథలు చెబుతూ వచ్చాడు. జనానికి మొహం మొత్తింది. ఫ్లాపులు స్టార్ట్ అయ్యాయి. అతను మారలేదు. డిజాస్టర్స్ వచ్చాయి. దీంతో తనది కాని కథతో టెంపర్ అంటూ హిట్ కొట్టాడు. హిట్ వచ్చిన తర్వాత మళ్లీ అదే కంటెంట్. దీంతో పూరీ సినిమా అంటే మాగ్జిమం ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చేలా చేసుకున్నాడు. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్, రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా చేసిన డబుల్ ఇస్మార్ట్ రెండూ డిజాస్టర్ అయ్యాయి. వీటికి నిర్మాత కూడా తనే కావడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు.

ఇవన్నీ ఎలా ఉన్నా.. ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే అన్నీ సర్దుకుంటాయి. అందుకోసమైనా ఎవరో ఒకరు అవకాశం ఇవ్వాలి కదా. ఈ మధ్య అక్కినేని క్యాంప్ లో ఎంటర్ అయ్యాడు. నాగార్జున, అఖిల్ తో సినిమాలు చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అఖిల్ తో ప్రాజెక్ట్ ఓకే అయిందన్నారు. ఇంతకు ముందు నాగ్ తో శివమణి అనే మాస్ మూవీ చేశాడు పూరీ. అందుకే ఈ ఆఫర్ ఇచ్చాడు అన్నారు. బట్ లేటెస్ట్ గా ఈ న్యూస్ కొట్టిపడేసింది అక్కినేని క్యాంప్. అఖిల్ తో సినిమా అనే మాటే లేదని తేల్చేశారు. దీంతో ఇవన్నీ రూమర్స్ గా మిగిలిపోయాయి.

నిజానికి ఇప్పుడు పూరీ జగన్నాథ్ పేరు చెబితే ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు ప్రధాన కారణం అతని దర్శకత్వం మీద నమ్మకం ఉన్నా.. కథల విషయంలోనే ఏ మార్పులూ కనిపించడం లేదు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ కావడం లేదు. ఇదే అతన్ని రేస్ లో చివర్లో నిలబెట్టింది.

Tags

Next Story