Puri Jagannadh: విజయ్ గురించి పూరీ.. అప్పులున్నాయని తెలిసి రూ.2 కోట్లు వెనక్కి..

Puri Jagannadh: మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ హవా కనిపిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ వరంగల్ వేదికగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పూరీ విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భార్య లావణ్య చెప్పడం వల్లే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి చూశానని చెప్పారు.
ఆ సినిమా చూస్తున్నప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. లైగర్ షూట్ చేస్తున్న సమయంలోనే ఒక నిర్మాతగా ఓ సారి కోటి రూపాయలు పంపిస్తే .. ఇప్పుడే వద్దు ముందు సినిమా కోసం ఖర్చు పెట్టండి అని వెనక్కి పంపించేశాడు.. ఆ తరువాత మరోసారి రూ.2 కోట్లు పంపిస్తే నాకు అప్పులు ఉన్నాయని తెలిసి వాటికి కట్టమన్నాడు.. ఇలాంటి నటుడిని ఇంతవరకు చూడలేదని పూరీ.. విజయ్ దేవరకొండ గురించి చెప్పుకొచ్చారు. విజయ్‌లో ఎక్కడా పొగరు కనిపించదని, అతడి నటనలో నిజాయితీ మాత్రమే కనిపిస్తుందని అన్నారు.
అర్జున్ రెడ్డి చూసిన నా భార్య.. కొత్త దర్శకులు వస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు.. నువ్వు వెనుకబడిపోతున్నావ్.. ఎవరో సందీప్ రెడ్డి వంగా అట.. కొత్తగా వచ్చాడు. విజయ్ అనే యువ నటుడితో అర్జున్ రెడ్డి తీశాడు.. చాలా బావుంది అని లావణ్య చెప్పడంతో ఆ పినిమా చూశా.
5 నిమిషాలయ్యే సరికి సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించలేదు. కేవలం విజయ్ యాక్టింగ్ స్కి్ల్స్‌పైనే నా ఫోకస్ నిలిచిపోయింది. అతడి నటనలో నిజాయితీ కనిపించింది. అతడితో ఎలాగైనా సినిమా చేయాలనుకున్నాను. అది లైగర్ ద్వారా తీరింది అని విజయ్‌పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు పూరీ జగన్నాథ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com