Akash Puri : పేరు మార్చుకున్న పూరీ కొడుకు

డైనమిక్ డైరెక్టర్ గా ఒకప్పుడు తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. బట్ మారని అతని హీరోల తీరు వల్ల రొటీన్ గా మారాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే తను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తీసిన సినిమాల్లో హీరోల చిన్నప్పటి పాత్రల కోసం తన కొడుకు ఆకాశ్ పూరీనే తీసుకునేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతన్ని తన వారసుడుగా నటనా రంగంలోకి దించాడు. ఆకాశ్ పెద్దయ్యాడు. హీరోగానూ మారాడు. బట్ ఇప్పటి వరకూ బ్రేక్ రాలేదు. వాయిస్ లో బేస్ ఉంది కానీ.. కెరీర్ కు ఇప్పటి వరకూ బేస్ పడలేదు. మామూలుగా ఇండస్ట్రీలో జాతకాల పిచ్చి బాగా ఉంటుంది. న్యూమరాజీలను ఎక్కువగా నమ్ముతారు. రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గాతేజ్ గా మార్చుకున్నాడు. అంతెందుకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ టైమ్ లో కళ్యాణ్ బాబు అనే పేరు పడుతుంది. పవన్ కళ్యాణ్ అని మార్చుకున్న తర్వాతే అతని దశ తిరిగింది.
అందుకే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ కూడా తన పేరును మార్చుకున్నాడు. ఇప్పటి వరకూ ఆకాశ్ పూరీగా ఉన్న తన పేరును ఆకాశ్ జగన్నాథ్ గా మార్చుకున్నానని ఇక నుంచి అలాగే పిలవాలని తన బర్త్ డే సందర్భంగా చెప్పాడు. మరి మారిన ఈ పేరు అతని ఫేట్ ను మార్చి కెరీర్ ను నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com