Puri Jagannadh : లైగర్ ఎఫెక్ట్.. లగ్జరీ ఫ్లాట్‌ను ఖాళీ చేసిన పూరీ..

Puri Jagannadh : లైగర్ ఫ్లాప్ పూరీ జగన్నాధ్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా ముందు పూరీ పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఆ అదే పరిస్థితిలో ఉన్నారు. రూ.120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా సగం కూడా వసూళ్లు చేసుకోలేక పోయింది. లైగర్ పై పూరీ చాలా ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. లైగర్ హిట్ అయితే.. ఇక టాప్ డైరెక్టర్లంతా తన ముందు క్యూ కడతారని.. దాంతో మొత్తం ముంబైలోనే సెటిల్ అయిపోవచ్చని అనుకున్నారట. దానికోసం ఇంటిని హైదరాబాద్ నుంచి ముంబైకు షిఫ్ట్ చేశారట.
ముంబైలో సీ ఫేసింగ్‌తో ఓ లగ్జరియస్ ఫ్లాట్‌ను నెలకు రూ.15 లక్షలకు రెంట్ తీసుకున్నారట. లైగర్ ఫ్లాప్ కావడంతో ఆ ఫ్లాట్ రెంటు కట్టలేని పరిస్థితిలో ఉన్నారట. బలవంతంగా ఖాలీ చేయించినట్లు బాలీవుడ్‌లో పెద్ద టాక్ వినిపిస్తోంది. గతంలో పూరీ జగన్నాధ్ మొత్తం ఆస్థిలన్నీ కోల్పోయినప్పుడు చేతిలో ఏమీ లేని పరిస్థితి. అప్పుడు అమితాబ్‌తో 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా తీసి మళ్లీ కావలసినన్ని డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ పూరీ ఏమి చేస్తారనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

