Puri Jagannadh: పూరీ డైరెక్షన్లో చిరంజీవి.. బ్లాక్ బస్టర్‌కు రెడీ..

Puri Jagannadh: ఓ రెండు దశాబ్దాల క్రితం పూరీ జగన్నాథ్ అనే పేరు మాస్ కు మంత్రం. అప్పట్లోనే చిరంజీవితో ఆటోజానీ అనే కథ చేయాలనుకున్నాడు పూరీ. బట్ మెగాస్టార్ మాత్రం తన కొడుకు రామ్ చరణ్ ను ఇచ్చి అతన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేయమన్నాడు.
కానీ చిరంజీవి మాత్రం పూరీకి డేట్స్ ఇవ్వకుండానే పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన లైగర్ తర్వాత ఇక పూరీ జగన్నాథ్ ను స్టార్ హీరోలెవరూ నమ్మరు అనుకున్నారు. కానీ చిరంజీవి నమ్మాడు.
మెగాస్టార్ రీసెంట్ మూవీ గాడ్ ఫాదర్ లో జర్నలిస్ట్ గా ఓ చిన్న పాత్రలో కనిపించాడు పూరీ జగన్నాథ్. ఆ పరిచయం తోనే లైగర్ పోయినప్పుడు అతన్ని ఓదార్చి మంచి కథ ఉంటే చెప్పమని అడిగాడు. దాన్ని సీరియస్ గానే తీసుకున్న పూరీ.. మెగాస్టార్ కు ఇప్పుడు సరిపోయే ఓ మాస్ స్టోరీతో అప్రోచ్ అయ్యాడట.
ఈ కథ చిరంజీవికి నచ్చడంతో ఓకే చెప్పాడు. మొత్తంగా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న కాంబినేషన్ ఇది. మరి ఇప్పటికైనా పూరీ జగన్నాథ్ హడావిడీ మరిచి కాస్త తన బలం అయిన కథ, మాటలపై మరింత శ్రద్ధ పెడితే మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com