Doubli Ismart, Mr Bachchan : పూరీ జగన్నాథ్ వర్సెస్ హరీష్ శంకర్
పూరీ జగన్నాథ్, హరీశ్ శంకర్. ఇద్దరూ ఒక్కరినే గురువుగా ఫీలవుతారు. అలాంటి ఇద్దరు దర్శకులు ఒకేసారి బాక్సాఫీస వద్ద తలపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫైట్ నే ఎక్స్ పెక్ట్ చేస్తాం. ఈ ఆగస్ట్ 15కు ఈ ఇద్దరు డాషింగ్ డైరెక్టర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ముందుగా పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ అయింది. లేటెస్ట్ గా హరీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్ ను ఆగస్ట్ 15 రిలీజ్ అని ప్రకటించారు. మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15కు రాదేమో అని చాలామంది భావించారు. బట్ వాళ్లూ బరిలోనే నిలిచారు. మరి ఈ ఇద్దరు దర్శకుల విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా నటించాడు. ఫస్ట్ పార్ట్ లో రామ్ తో పాటు నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్ నటించారు. బట్ ఈసారి హీరోయిన్ గా కావ్య థాపర్ ను తీసుకున్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్ తో పాటు రెండు పాటలూ ఆకట్టుకున్నాయి. కంప్లీట్ పూరీ జగన్నాథ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ మూవీ. ప్రస్తుత ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. కానీ పూరీ మారినట్టు కనిపించడం లేదు. బట్ ఈ టైప్ మాస్ ఎంటర్టైనర్స్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఇక 2018లో బాలీవుడ్ లో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన రైడ్ చిత్రానికి రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. మాస్ మహరాజ్ రవితేజ, భాగ్య శ్రీ బోర్సె జంటగా నటిస్తోన్న ఈ మూవీ 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. రీమేక్ అంటే హరీష్ శంకర్ ఇంకా ఇంప్రవైజ్ చేస్తాడు. బెటర్ గా రాసుకుంటాడు. పైగా తనకు ఇష్టమైన రవితేజ హీరో కాబట్టి ఆ ఇమేజ్ కు తగ్గట్టుగానే రాసుకుని ఉంటాడు. ఇంకా టీజర్, ట్రైలర్ రాలేదు కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రాలేం. బట్ కొన్నాళ్లుగా రవితేజ వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. దానికి హరీష్ శంకర్ బ్రేకులు వేస్తాడు అంటున్నారు.
మొత్తంగా ఆర్జీవీ ఫాలోవర్స్ గా పూరీ, హరీష్ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తలపడుతుండటం మాత్రం బాక్సాఫీస్ కు ఓ కొత్త జోష్ తెచ్చేదే అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com