Puri Musings: 'పూరీ మ్యూజింగ్స్' కొత్త టాపిక్ 'వ్యాన్ లైఫ్'

Puri Musings: దర్శకుడు పూరీ జగన్నాథ్ లాక్డౌన్ లో పూరీ మ్యూజింగ్స్ పేరుతో సరికొత్త టాపిక్స్ ని పరిచయం చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న టాపిక్ వ్యాన్ లైఫ్.
విదేశాల్లో ఎంతో మంది ప్రజలు వ్యాన్స్ లోనే జీవనం సాగిస్తున్నారని పూరీ తెలిపారు. 18వ శతాబ్ధం నుంచే వ్యాన్ లైఫ్ జీవన విధానం ఉందని దీని గురించిన ఎన్నో విశేషాలు తెలియజేశారు. అంతే కాకుండా మనకున్న కారుని ఎలా మార్చుకోవచ్చో కూడా తెలిపారు.
18వ శతాబ్ధంలో వ్యాగన్స్ కి గుర్రాలు కట్టి వాటిపై ప్రయాణించేవారు. బ్రిటీష్ వాళ్లు ఎక్కువగా ఈ వ్యాగన్స్ లోనే ప్రయాణించే వాళ్లు. కాబట్టే ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ప్రారంభమైంది. ఫోక్స్ వ్యాగన్ అంటే ప్రజల కార్లు అని అర్థం అన్నారు.
కొన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లను కాంపర్వన్స్ గా మార్చవచ్చు. యూఎస్ లో పాతబడిన స్కూల్ బస్సులను ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే కాంపర్వన్స్ కొనే పనిలేకుండా మనకున్న కారుని కూడా కాంపర్వన్ గా మార్చుకోవచ్చని తెలిపారు. దానికి మీరు చేయవలసిందల్లా
మీ వెహికల్ మోడల్ చెప్పాలి. దాన్ని బట్టి వారు కారు డిక్కీలోకి సరిపడా మొబైల్ కిచెన్ ఏర్పాటు చేస్తారు.
రెండోది రూఫ్ టెంట్. మూడోది 270 డిగ్రీల అనింగ్. ఈ మూడు కారుకి అటాచ్ చేస్తే వ్యాన్ లైఫ్ కి రెడీ అయిపోవచ్చు. ప్రపంచంలో ఎన్నో మిలియన్ల మంది సంవత్సరాల తరబడి వ్యాన్ లైఫ్ లో ఉన్నారు. ఇలా ఉన్న వాళ్లకి సంబంధించి ఒక కోట్ ప్రచారంలో ఉంది. అది 'హోమ్ ఈజ్ వేర్ యూ పార్క్ ఇట్' అని పూరీ వివరించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com