Puri vs. Harish : పూరీ వర్సెస్ హరీష్.. విన్నర్ తేలేది రెండు రోజుల్లోనే
సినిమాల రిలీజ్ డేట్స్ పుణ్యమా అని ఒకప్పుడు గురు శిష్యుల్లా ఉన్న పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్ ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ముందుగా పూరీ జగన్నాథ్ తన డబుల్ ఇస్మార్ట్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేశాడు. నిజానికి ఆ టైమ్ లో పుష్ప 2 వస్తుందని చాలామంది భావించారు. ఆ మూవీ పోస్ట్ పోన్ కాగానే పూరీ అనౌన్స్ చేశాడు. మాగ్జిమం డబుల్ ఇస్మార్ట్ కు పెద్ద పోటీ ఉండదు అనుకున్నారు చాలామంది. బట్ అప్పటి వరకూ పెద్దగా సందడి కూడా చేయని మిస్టర్ బచ్చన్ ను కూడా అదే రోజు విడదల చేస్తున్నాం అని ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు.
పూరీ అండ్ టీమ్ ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పూరీకి హరీష్ తో పాటు రవితేజ కూడా మంచి ఫ్రెండ్సే. అసలే కష్టాల్లో ఉన్న తనకు మంచి బిజినెస్ జరిగింది. మంచి రిలీజ్ డేట్ దొరికిందని హ్యాపీగా ఫీలవుతోన్న టైమ్ లో సడెన్ గా ఫ్రెండ్సే పోటీకి రావడంతో షాక్ అయ్యాడు పూరీ. మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ అనౌన్స్ కాగానే ఛార్మీ వెంటనే తన ట్విట్టర్, ఇన్ స్టా అకౌంట్స్ నుంచి హరీష్ శంకర్ ను బ్లాక్ చేసింది. ఈ విషయంలో నిర్ణయం నిర్మాతలదే తప్ప తన ప్రమేయం లేదు అని హరీష్ సమర్థించుకున్నాడు. బట్ అప్పటికే రెండు క్యాంప్ ల మధ్య గ్యాప్ వచ్చేసిందనే చెప్పాలి.
ఇక పోటా పోటీగా ప్రమోషన్స్ చేస్తూ ఒకరిపై ఒకరు ఆధిపత్యంతో దూసుకుపోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ బచ్చన్ ట్రైలర్ కు రాలేదు. కాకపోతే బచ్చన్ సాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ 15న రెండు సినిమాల సత్తా ఏంటనేది తేలిపోతుంది. మరి ఆ తర్వాత ఈ దర్శకులిద్దరూ పాత ర్యాపోను మెయిన్టేన్ చేస్తారా లేదా అనేదీ తెలుస్తుంది. అలాగే ఎవరి సినిమా రిజల్ట్ పై ఎవరి సినిమా ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా ఆడియన్స్ కు అర్థం అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com