Pushpa 2: తగ్గేదేలే.. బాలీవుడ్ స్టార్స్‌ని బీట్ చేసేందుకు పుష్పరాజ్ రెడీ

Pushpa 2: తగ్గేదేలే.. బాలీవుడ్ స్టార్స్‌ని బీట్ చేసేందుకు పుష్పరాజ్ రెడీ
Pushpa 2: ఆడియన్స్‌కు నచ్చే విధంగా సుకుమార్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట.

Pushpa 2: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అని పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ బన్నీని చూసి అనుకోవాల్సి వస్తుందేమో.. బాలీవుడ్ ఆడియన్స్ బన్నీ నటించిన పుష్ప పార్ట్ 2 కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ బాహుబలి 2 హిందీ వెర్షన్ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.

మరి ఈ రికార్డ్ బ్రేక్ చేయాలని బన్నీ ఎదురుచూస్తున్నాడు.. ఇంతవరకు బాలీవుడ్ నటీనటులు ఎవరూ ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయలేదు. పుష్ప పార్ట్ 2 హిందీ రైట్స్ కొనుగోలు చేసిన మనీష్ షా.. బన్నీ ఈ రికార్డ్‌ని బ్రేక్ చేస్తాడని చెబుతున్నాడు. అంతేకాకుండా పుష్ప 2 ఈ ఏడాదిలో విడుదల కాదని చెబుతున్నాడు.

అయితే పుష్ప 2 స్టోరీని పాన్ ఇండియా ఆడియన్స్‌కు నచ్చే విధంగా సుకుమార్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరింత పవర్‌ఫుల్‌గా కథను మారుస్తున్నారట సుకుమార్. ఈ ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 250 రోజుల పాటు చిత్రీకణ జరుపుకుంటుందట.

భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నారట. అందుకే 2022లో కాకుండా 2023లో పుష్ప 2ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. అదు నిజమైతే బన్ని ఫ్యాన్స్ పుష్ప 2 కోసం మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story