‘పుష్ప2‘ ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్

‘పుష్ప2‘ ఇంటర్వెల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్
X
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యికోట్లు మార్క్ ను టచ్ చేసే సత్తా ఉన్న చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‘ ఒకటి

తెలుగు సినిమాకి సరికొత్త స్క్రీన్ ప్లే పాఠాలు నేర్పిన క్రియేటివ్ జీనియస్.. సుకుమార్. ఒక సీన్ తర్వాత ఏ సీన్ రాబోతుందనేది ఊహకు అందని రీతిలో డిజైన్ చేసి.. సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తుంటాడు ఈ లెక్కల మాస్టారు. లేటెస్ట్ గా ‘పుష్ప‘ సెకండ్ పార్ట్ లో తన స్క్రీన్ ప్లే టాలెంట్ ను మరోసారి ప్రదర్శించబోతున్నాడట. ‘పుష్ప: ది రూల్‘ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెవర్ బిఫోర్ అన్నట్టు మెస్మరైజ్ చేస్తుందట.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యికోట్లు మార్క్ ను టచ్ చేసే సత్తా ఉన్న చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‘ ఒకటి. సెన్సేషనల్ హిట్ ‘పుష్ప: ది రైజ్‘కి కొనసాగింపుగా రాబోతున్న చిత్రమిది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ఘన విజయాన్ని సాధించడంతో ఇప్పుడు సెకండ్ పార్టును అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ క్రేజీ మూవీ ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఆమధ్య విడుదలైన ‘వేర్ ఈజ్ పుష్ప‘ వీడియోతో సెకండ్ పార్ట్ పై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

ఫస్ట్ పార్ట్ లో ఉన్న నటీనటులతో పాటు.. సెకండ్ పార్ట్ లో జగపతిబాబు, హైపర్ ఆది వంటి మరికొంతమంది నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా.. ఇతర భాషల నుంచి కూడా పలువురు స్టార్స్ ఈ మూవీలో కేమియోస్ తో మురిపించబోతున్నారనే ప్రచారం ఉంది. ఫస్ట్ పార్ట్ మ్యూజికల్ గా సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో సాంగ్స్ ని కూడా అంతకుమించి అన్న రీతిలో తీర్చిదిద్దుతున్నాడట రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.

బడ్జెట్ విషయంలో పరిమితులు లేకపోవడంతో ‘పుష్ప2‘ సీన్స్ ను లార్జర్ దెన్ లైఫ్ అనే రీతిలో తీర్చిదిద్దుతున్నాడట సుకుమార్. గ్రాండ్యుయర్ విజువల్స్ తో పాటు.. స్టోరీ పరంగా తన మార్క్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయనున్నాడట. ముఖ్యంగా.. ‘పుష్ప2‘లోని ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఓ లెవెల్ లో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ రష్మిక తో ముడిపడి ఉండే ఆ సీన్ ను ఊహకు అందని రీతిలో డిజైన్ చేశాడట సుకుమార్. మూవీకే ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అవ్వనుందట. మొత్తంమీద.. సెకండ్ పార్ట్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ రూల్ ఏమేరకు ఉంటుందో చూడాలి.

Tags

Next Story