Pushpa 2 : దేవర కంటే ఎక్కువ కావాలట
దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుని రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఈ మూవీ అతని కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను భారీగా పెంచడం కూడా ఓ ప్రధాన కారణం. నిజానికి ఎన్టీఆర్ మూవీకి ఏపిలో ఆదరణ ఉండదేమో అనుకున్నారు. బట్ అక్కడ కూడా వీళ్లు అడిగినంతా పెంచేశారు. ఇప్పుడు ఆ రూట్ లోనే అడుగుపెడుుతున్నాడు పుష్ప రాజ్.
అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప 2 డిసెంబర్ 5 న విడుదల కాబోతోంది. దీంతో ఇప్పటి నుంచే టికెట్ ధరల కోసం ఆరాట పడుతున్నారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవర కంటే ఎక్కువ ధరలు పెంచాలని కోరుతోందట నిర్మాణ సంస్థ. ఈ మేరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పాటు అక్కడి ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట తెలంగాణలో కూడా అలాగే డిమాండ్ చేయబోతున్నారట. దేవర కంటే తమది పెద్ద బడ్జెట్ మూవీ అనీ.. ప్యాన్ ఇండియా స్థాయిలో ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి మా ధరలను మరింత పెంచమని అడగబోతున్నారు అని టాక్.
పుష్పను ఏపి కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మైత్రీ వాళ్లే డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతున్నారు. ఇలా టికెట్ ధరలు పెరిగితే అది నేరుగా వారి పాకెట్ లోకే వెళుతుంది. అందుకే అంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. మరి వీరి ప్రయత్నానికి ప్రభుత్వాలు అండగా నిలుస్తాయా లేదా అనేది చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com