Pushpa 2 : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ను పట్టించిన పుష్ప 2

Pushpa 2 :  మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ను పట్టించిన పుష్ప 2
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అంటూ ఇతర హడావిడీ పెద్దగా లేకుండానే రొటీన్ ఊరమాస్ ఎంటర్టనర్ కు నార్త్ ఆడియన్స్ కలెక్షన్ల పట్టం కడుతున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సీక్వెల్ కు రష్మిక మందన్నా, కిస్సిక్ సాంగ్ ఎసెట్ గా నిలిచాయి. ఫహాద్ ఫాజిల్ విలనీ బలంగా లేకపోయినా.. బలమైన విలన్ లేకున్నా.. పుష్ప 2 కలెక్షన్ల పరంగా ఊచకోతను తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే 1500 కోట్ల మార్క్ ను దాటేసింది. బాహుబలి 2 రికార్డ్స్ ను ఎయిమ్ చేసిందని చెబుతున్నారు. అది సాధ్యం అవుతుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఈ మూవీ తాజాగా ఒక మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ ను పట్టించిందనే వార్త కూడా సెన్సేషనల్ గా మారింది.

మహరాష్ట్రలోని నాగ్ పూర్ లోని ఓ మల్టీ ప్లెక్స్ లో పుష్ప 2 చిత్రాన్ని చూస్తున్నాడు.. అక్కడ నటోరియస్ గ్యాంగ్ స్టర్ విశాల్ మేష్రమ్. అతనిపై రెండు హత్య కేస్ లు, డ్రగ్ ట్రాఫికింగ్, అత్యంత హింసాత్మక సంఘటనలు చేశాడు అన్న అంశాలపై ఏకంగా 27 కేస్ లు నమోదయ్యాయి. 10 నెలలుగా తప్పించుకు తిరుగుతూ పోలీస్ లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అలాంటి తను కేవలం సినిమా చూడాలన్న కోరికతో థియేటర్ కు వచ్చి పోలీస్ లకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అతను సినిమా చూస్తూ ఉండగానే థియేటర్ లో చుట్టు ముట్టిన పోలీస్ లు అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం మరో సినిమా కథను తలపించిందంటున్నారు స్వయంగా చూసిన వాళ్లు. మొత్తంగా సినిమాలో హీరో క్రిమినల్. ఆ క్రిమినల్ ను చూడ్డానికి వచ్చిన నిజ జీవిత క్రిమినల్ పోలీస్ లకు చిక్కడం విశేషం అనే చెప్పాలి.

Tags

Next Story