Pushpa 2 : పుష్ప 2 హిందీలో అరాచకంగా ఉంది

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ పై విరుచుకు పడ్డాడా అన్నట్టుగా ఉంది పుష్ప 2 రిజల్ట్. ఫస్ట్ డే నే 294 కోట్లు వసూలు చేసి ఓపెనింగ్ డే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఫీట్ సాధించిన సినిమా లేదు. అంతకు ముందు ఆర్ఆర్ఆర్ ఫస్డ్ డే హయ్యొస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను కలిగి ఉంది. ఆ రికార్డ్ ఎంతో కాలం నిలవకుండా చేసింది పుష్ప2. అల్లు అర్జున్ మానియా మనకంటే ఎక్కువగా నార్త్ లో కనిపిస్తుండటం విశేషం. ఫస్ట్ పార్ట్ కూడా అక్కడే పెద్ద విజయం సాధించింది. అప్పుడు లాంగ్ రన్ లో వచ్చిన కలెక్షన్స్ అన్నీ ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు రెండు రోజుల్లోనే వచ్చేస్తున్నాయి.. అంటే ఈ మూవీ నార్త్ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
హిందీలో పుష్ప 1 ఫుల్ రన్ కలెక్షన్స్ 129 కోట్లు. ఈ ఫిగర్ ఇప్పుడు రెండు రోజుల్లోనే దాటేసింది పుష్ప 2. హిందీ పరంగా చూసినా ఫస్ట్ డే రికార్డ్ ను పుష్ప 2 మార్చేసింది. ఈ చిత్రం అక్కడ 72 కోట్లు సాధించింది. హిందీ హీరోలు కూడా చేయలేకపోయిన ఫీట్ ను ఐకన్ స్టార్ అందుకున్నాడు. ఇక సెకండ్ డే కూడా అదే ఊపు కనిపించింది. రెండో రోజు హిందీలో పుష్ప 2 కి 59కోట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే రెండు రోజుల్లోనే ఫస్ట్ పార్ట్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఏకంగా 131 కోట్లు సాధించిందీ మూవీ. లాంగ్ రన్ లో ఈజీగా 300 కోట్ల మార్క్ టచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ జోష్ చూస్తుంటే ఆ మార్క్ ను చేరడం పెద్ద కష్టమేం కాదు అనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com