Pushpa 2 release date: 'పుష్ప 2' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఫ్యాన్స్ కు పూనకాలే

Pushpa 2 release date: పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఫ్యాన్స్ కు పూనకాలే
పుష్ప 2 రిలీజ్ డేట్ ఖరారు.. క్రేజీ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

జాతీయ అవార్డ్-విజేత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్-ఇండియన్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి ప్రఖ్యాత దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై క్లారిటీ ఇచ్చారు. 'పుష్ప 2' ను వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

అభిమానులను సంతోషపెట్టడానికి, మేకర్స్ తమ సోషల్ మీడియాలో ఈ ఇంట్రస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15, 2024న ప్రధాన భారతీయ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఓ అద్భుతమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రక్తపు మరకలతో ఉన్న చేయి, దానికి ఉంగరాలు.. చిటికెన వేలుకు గోర్ల రంగు.. చేతికి గోల్డ్ బ్రేస్ లెట్స్ .. ఆద్యంతం మూవీపై భారీ హైప్ ను తెచ్చిపెట్టేవిలా ఉన్నాయి.

అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని పలువురు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' లో చూసిన దాని కంటే పుష్ప 2 లోని యాక్షన్ సన్నివేశాలు, VFX మరింతగా ఉంటాయని అంటున్నారు. ఇక సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన 'గదర్ 2' వలె 'పుష్ప 2' అదే లెవల్ లో క్రేజ్ ను తెచ్చుకుంటుందని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. అందుకే అల్లు అర్జున్ కూడా తన బృందాన్ని 'ఆర్ఆర్ఆర్' కంటే మరింత పెద్ద హిట్ అయ్యేలా రూపొందించాలని' కోరాడు. ఇక పుష్ప: ది రూల్ భారీ మొత్తంలో రూ. 90 కోట్లు వసూలు చేసిందని, అలాగే రూ. 100 కోట్లను అధిగమించే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

కొన్ని వారాల క్రితం, జాతీయ అవార్డు విజేతలను ప్రత్యక్షంగా ప్రకటించారు. సుకుమార్ చిత్రం, 'పుష్ప: ది రైజ్‌'లో తన నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. బన్నీ తన జాతీయ అవార్డు వచ్చిన సందర్భాన్ని దర్శకుడితో కలిసి జరుపుకున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. దర్శకుడిని కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేశాడు. 2021లో విడుదలైన ఈ సినిమా సౌత్ లోనే కాకుండా హిందీ, నార్త్ బెల్ట్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర ఆన్‌లైన్‌లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అది అతని నడక, డైలాగ్‌లు, .. ఇలా ప్రతిదీ ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయింది. ఇక 'పుష్ప 2'లో అల్లు అర్జున్ ప్రేమికురాలిగా రష్మిక మందన్న కనిపించనుంది, వీరితో పాటు ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story