Pushpa2 : స్పీడు పెంచిన పుష్ప 2 టీమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. అందుకోసం పుష్ప 2 టీమ్ నిర్విరామంగా కష్టపడుతున్నాడట. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన కొత్త షెడ్యూల్ మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్. త్వరగా ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా ప్రమోషన్ పనులు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమా విడుదల తరువాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com