Robinhood Trailer : రాబిన్ హుడ్ పై పుష్ప 2 ఎఫెక్ట్

Robinhood Trailer  :   రాబిన్ హుడ్ పై పుష్ప 2 ఎఫెక్ట్
X

నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీపై పుష్ప 2 ఎఫెక్ట్ పడింది. దీంతో ఇవాళ విడుదల కావల్సిన ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించాడు అని చెబుతున్నారు. అలాగే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కేమియో రోల్ చేశాడు. అతను ఈ నెల 23న జరగబోతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నాడు. ఈలోగా ట్రైలర్ రిలీజ్ చేస్తే బావుంటుందనుకున్నారు మేకర్స్. అందుకే ఈ 21న ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ ఇవాళ ట్రైలర్ విడుదల కావడం లేదు. అందుకు కారణం పుష్ప 2 ఎఫెక్ట్.

ట్రైలర్ రిలీజ్ ను కూడా ఓ ఫంక్షన్ లా చేయాలనుకున్నారు. ట్రైలర్ అంటే థియేటర్స్ లో ప్రదర్శించాలి కదా.. అందుకే థియేటర్ లోనే ఫంక్షన్ అనుకుకున్నారు. బట్ అందుకు పర్మిషన్ రాలేదు. దీంతో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ట్రైలర్ కూడా రావడం లేదు. ఇలాంటప్పుడు డైరెక్ట్ గా యూ ట్యూబ్ లో విడుదల చేస్తారు. బట్ వీళ్లు ఈవెంట్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ట్రైలర్ వదలుతాం అని ప్రకటించారు.

థియేటర్ లో ఫంక్షన్ చేస్తే మళ్లీ తొక్కిసలాటలు జరిగి ఆనక ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వం కార్నర్ ల పడుతుంది. అందుకే పర్మిషన్ ఇవ్వలేదు.

పుష్ప 2 తో ఓ చేదు అనుభవం ఉంది. పైగా ఈ చిత్రానికీ ఆ నిర్మాతలే ఉన్నారు. మొత్తంగా రాబిన్ హుడ ట్రైలర్ ఈ 21న రావడం లేదు. 23న విడుదల చేస్తారట.

Tags

Next Story