Allu Arjun : ఇదే పుష్ప 2 ట్రైలర్ డేట్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా, ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటించిన సినిమా పుష్ప 2. డిసెంబర్ 5న విడుదల కాబోతోన్న ఈమూవీపై అతి భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప రాజ్ రిలీజ్ తర్వాత రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉందో తెలియాలి. పూర్తిగా కాదు కానీ.. ట్రైలర్ వస్తే ఆ సినిమా రేంజ్ ఏ రేంజ్ కు వెళుతుందనే అంచనాలు వేయొచ్చు. అందుకే పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ కోసం బాగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు పుష్ప రాజ్.
ఈ సారి అస్సలు తగ్గేదే లేదు.. అంటూ రాబోతోన్న పుష్ప 2 ట్రైలర్ ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. ఆ రోజున సాయంత్రం 6. 03 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఈ ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ను బిహార్ రాష్ట్రం పట్నాలో నిర్వహించబోతున్నారు. గేమ్ ఛేంజర్ టీమ్ టీజర్ కోసం లక్నో వెళ్లింది. ఇప్పుడు పుష్ప 2 టీమ్ ఫస్ట్ ట్రైలర్ ను పట్నా వేదికగా దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ లో ఓ గన్ భుజంపై పెట్టుకుని తనదైన శైలిలో స్టైల్ గా నడుచుకుంటూ వస్తోన్న అల్లు అర్జున్ ఉన్నాడు.
ఇక ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ కాస్త ఇబ్బంది పెట్టాడని.. టైమ్ కు అందివ్వడం లేదు అనే కారణంతో నేపథ్య సంగీతం కోసం తమన్ ను తీసుకున్నారు. ఫస్ట్ పార్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన దేవీని పక్కన పెట్టడం కాస్త ఆశ్చర్యమే అయినా మూవీ రిలీజ్ కు పెద్ద టైమ్ లేదు కాబట్టి.. వాళ్ల నిర్ణయాలేవో వాళ్లు తీసుకున్నారనే చెప్పాలి. మరి ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజీషియన్ మార్పు సినిమా రిజల్ట్ పై ఏదైనా ప్రభావం చూపిస్తుందా అనేది చూడాలి. మొత్తంగా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com