Allu Arjun Pushpa 2 : పుష్ప 2 వైల్డ్ కలెక్షన్స్

Allu Arjun Pushpa 2 :  పుష్ప 2 వైల్డ్ కలెక్షన్స్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కాస్త డల్ గా ఉన్నా.. ఉత్తరాదిన మాత్రం ఊపేస్తోంది. అటు ఓవర్శీస్ లో సైతం థియేటర్స్ ఊగిపోతున్నాయి. తెలుగులో కొన్ని థియేటర్స్ లో ఆడవాళ్లు జాతర ఎపిసోడ్స్ కు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే వెయ్యి కోట్లకు ఎందుకు అమ్ముడు పోయిందో ఇప్పుడర్థం అవుతోంది అందరికీ. ఫస్ట్ డే మొదటి రోజు హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ కొడితే.. రెండో రోజూ అదే జోష్ కంటిన్యూ అయింది.

రెండో రోజు ఈ చిత్రానికి 159 కోట్ల కలెక్షన్స్ వసూలయ్యాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 449 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులను బద్ధలు కొడుతోంది. పుష్ప రాజ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడనే చెప్పాలి. ఈ దూకుడు శని, ఆదివారాల్లో కూడా ఉంటే.. కొన్నవాళ్లందరికీ ఇంక పండగే అని చెప్పాలి. ఏదేమైనా అల్లు అర్జున్ ఈ పాత్రలో ప్రాణం పెట్టి నటించాడు. తను పుష్పరాజ్ అని బలంగా నమ్మితే తప్ప అంత హార్డ్ వర్క్ చేయలేరు. అటు తెలుగుకు సంబంధించి రష్మిక మందన్నాకు ఇదే బెస్ట్. శ్రీ లీల పాట జాతర ఎపిసోడ్, ఫహాద్ తో తలపడే సీన్స్, మాల్దీవ్స్ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ ఫైట్ కు థియేటర్స్ లో అరుపులే అరుపులు. అదే ఇన్ని కలెక్షన్స్ కారణం అనుకోవచ్చు.

Tags

Next Story