Pushpa Hindi: 'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్‌కు భారీ షాక్..

Pushpa Hindi: అల్లు అర్జున్ ఇప్పటివరకు టాలీవుడ్, మాలీవుడ్‌లో మాత్రమే స్టార్ హీరోగా వెలిగిపోయాడు. తన సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్స్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో అక్కడి ప్రేక్షకులకు కూడా తాను దగ్గరయ్యాడు. కానీ ఈ హీరో నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రమే ఈ రేంజ్‌లో హిట్ అవుతుందని ఊహించలేదు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు 'పుష్ప' హిందీ డిస్ట్రిబ్యూటర్ మనీష్ షా.
సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. దానికి తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్స్‌కు యూట్యూబ్‌లో వచ్చే వ్యూసే ఉదాహరణ. అయితే ఈ తెలుగు సినిమాలను డబ్బి్ంగ్ వర్షన్స్ రూపంలో థియేటర్లలోకి తీసుకెళ్లిన ఘనత మాత్రం మనీష్ షాకే దక్కుతుంది. దాదాపు 10 సంవత్సరాల పైనుండే ఆయన తెలుగు సినిమాల డబ్బింగ్ వర్షన్స్‌కు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
కంటెంట్‌కు భాషతో సంబంధం లేదు. ఆడియన్స్‌కు కథ నచ్చితే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, భాష ఏంటి అన్ని విషయాలను పట్టించుకోరు అంటున్నారు మనీష్ షా. తెలుగు సినిమా అయినా కూడా హిందీ డబ్బింగ్ వర్షన్‌తో టీవీలోని టీఆర్‌పీ విషయంలో రికార్డు సృష్టించిన సినిమా 'సరైనోడు' అని ఆయన పేర్కొన్నారు. అయిదేళ్ల పాటు ఈ రికార్డును ఎవరు చెరపలేకపోయారని ఆయన అన్నారు.
అల్లు అర్జున్ తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్స్ ఎన్నో యూట్యూబ్‌లో కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. 'పుష్ప' సినిమా హిందీలో 1600 స్క్రీన్స్‌లో విడుదల అయ్యింది. దీనికి మనీష్ షానే డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. విడుదలయ్యి ఏడో వారం అయినా కూడా ఇంకా 1000కి పైగా థియేటర్లలో పుష్ప హిందీ వర్షన్ కొనసాగడం విశేషం.
పుష్ప ముందుగానే పెద్ద హిట్ అవుతుందని ఊహించామని మనీష్ షా అంటున్నారు. అల్లు అర్జున్ పెద్ద స్టార్ కాబట్టి ఇలా జరగడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. కానీ ఓటీటీలో వచ్చినా కూడా ఇంకా థియేటర్లలో నడుస్తుందని మాత్రం ఊహించలేదని తెలిపారు మనీష్ షా. ఇది ఆయనకు ఇంకా షాకింగ్‌గానే ఉందని తెలిపారు. పైగా బాలీవుడ్ మేకర్స్.. సౌత్ సినిమాలను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఉపదేశం ఇచ్చారు మనీష్ షా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com