Pushpa Item Song : తగ్గేదే లే.. సమంత పాటకి యూట్యూబ్ షేక్..!

Pushpa Item Song : టాలీవుడ్ లో ఇప్పుడు పుష్ప హావా మాములుగా లేదు.. ఎక్కడ చూసిన ఈ సినిమా పాటలే సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమంత చేసిన 'ఊ అంటావా మామా.. ఊహూ అంటావా' పాట శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంది. మత్తు వాయిస్‌తో సాగే ఈ పాట శ్రోతలచేత వన్స్ మోర్ అనిపిస్తోంది. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా.. ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను ఆలపించారు. దేవి మ్యూజిక్ అందించాడు. ఇప్పుడీ ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
తాజాగా అన్ని భాషల్లో కలుపుకొని ఈ పాటకి 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా 1.6మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. కాగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుండగా గంధపు చెక్కలు, స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com