Pushpa Item song : పుష్ప ఐటెం సాంగ్.. ఎవరీ ఇంద్రావతి చౌహాన్?

Pushpa Item song : అల్లు అర్జున్-సుకుమార్-దేవిశ్రీప్రసాద్ అంటేనే పక్కా ఐటెం ఉంటుంది.. అలాంటి వీరికి స్టార్ హీరోయిన్ సమంత తోడైతే ఇంకెలా ఉంటుంది. ఆ రచ్చ మాములుగా ఉండదు.. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొద్దిసేపటి క్రితమే ఐటెం సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేశారు. ఊ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మావా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటోంది.
చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ అందించగా ఇంద్రావతి చౌహాన్ ఈ పాటను పాడారు. హస్కీ వాయిస్ తో కూడిన ఆమె వాయిస్ ప్రేక్షకులకు నిజంగా మత్తు ఎక్కిస్తుంది. ఇంతకీ ఈ ఇంద్రావతి చౌహాన్ ఎవరంటే సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చెల్లెలు.. ఇంద్రావతి కూడా మంచి ఫోక్ సింగర్.. ఇప్పటికే చాలా ఫోక్ సాంగ్స్ పాడింది. కోటి న్యాయ నిర్ణేతగా 'బోల్ బేబీ బోల్' రియాలిటీ షోలో ఆమె పాటలు పాడింది.
ఇక జార్జిరెడ్డి సినిమాలో ఇంద్రావతి జాజిమోగులాలి అనే పాట పాడింది. ఆమెకి ఇప్పుడు ఏకంగా పుష్పలో ఐటెం సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది. ఈ పాట ఆమెకి ఫుల్ క్రేజ్ తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com