అల్లు అర్జున్‌ మేకప్‌కు అంత సమయమా..! బన్ని డెడికేషన్‌‎కి యూనిట్ ఫిదా..

అల్లు అర్జున్‌ మేకప్‌కు అంత సమయమా..! బన్ని డెడికేషన్‌‎కి యూనిట్ ఫిదా..
Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.

Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. అయితే సినిమా ఎంపిక విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారో.. పాత్ర ఎంపిక పట్ల కూడా అంతే డెడికేష‌న్‌ తో ఉంటాడు బన్నీ.. పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎంత క‌ష్టమైన ఇష్టంగా చేస్తారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ మునుపెన్నడు చూడని విధంగా మాస్‌ లుక్‌తో అలరించబోతున్నాడని ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది.

అల్లు అర్జున్‌ 'పుష్ప' భయంకరమైన స్మగ్లర్‌ పుష్పరాజుగా నటించబోతున్నాడు. అయితే తన గెటప్ కోసం బన్నీ చాలా టైం కేటాయిస్తున్నారంట. మేకప్‌కు వేసుకోవడానికి, తీయడానికి 3 గంటల పైనే సమయం పడుతుందంట. ఈ మూవీలో అల్లు అర్జున్ మేకప్ వేయడానికి రెండు గంటలు, ఆ మేకప్‌ను తొలగించడానికి గంటకు పైనే సమయం పడుతుందంట. రింగులజుట్టు, గడ్డంతో మాస్‌ లుక్‌లో టాన్ టచ్ అప్‌లు చేయించుకుంటున్నాడు. ఆయ‌న డెడికేష‌న్‌ను చూసి డైరెక్టర్‌తో పాటు సెట్‌లోని మిగతా బృందం ఫిదా అవుతున్నారట. ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.

'పుష్ప' చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. హిందీ. తమిళ, తెలుగుతోపాటు పలు భాషల్లో సినిమా తెరకెక్కనుంది. పార్ట్ వ‌న్ క్రిస్మస్ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్‌ మునుపెన్నడు చూడని విధంగా మాస్‌ లుక్‌తో అలరించబోతున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ బాణీలు కట్టారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.Tags

Next Story