Pushpa Movie: తగ్గేదేలే... పరీక్ష రాసేదేలే..

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించినా అందులో ఏదో ఒక డైలాగ్ కచ్చితంగా ఫేమస్ అవుతుంది.. ఇక ఫ్యాన్స్ తో పాటు మిగిలిన వాళ్లు ఆ పదాన్ని ప్రయోగిస్తుంటారు ప్రతి పనిలో.. బన్నీ మ్యానియా అలాంటిది మరి..
బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఫీవర్ అల్లు అర్జున్ మరో సినిమా వచ్చేంత వరకు తగ్గదు.. అందుకే తగ్గేదేలే అంటున్నారు అంతా.. ఈ ఫీవర్ తెలుగు రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్ కి కూడా పాకింది. ఇటీవల అక్కడ పదోతరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి.
ఆన్సర్ షీట్ లో ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు రాయకుండా పుష్ప డైలాగులు రాశాడు. పుష్ప.. పుష్పరాజ్.. అపున్ లిఖేగా నహీ (పరీక్ష రాసేదేలే) అని రాశాడు. దీనికి సంబంధించిన ఆన్సర్ షీట్ ను ఉపాధ్యాయుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com