Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. 'పుష్ప' సినిమా నేరుగా యూట్యూబ్‌లో..

Pushpa Movie (tv5news.in)
Pushpa Movie: హీరోలు, హీరోయిన్లు స్క్రీన్‌పై కమర్షియల్ ఎలిమెంట్స్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఎప్పుడో మానేశారు. గ్లామర్, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటి పరిధిని దాటి ఆలోచించడం మొదలుపెట్టారు. దర్శకులు కూడా వారికి తగినట్టుగా డీ గ్లామర్ పాత్రలతో కథలు రాయడం మొదలుపెట్టారు. అలాంటి ఒక సినిమానే సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప'. ఈ సినిమా నుండి ఒక షాకింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
యాక్టింగ్‌తో, డ్యాన్సులతో ఎప్పుడూ స్క్రీన్‌పై స్టైలిష్‌గా కనిపించే అల్లు అర్జున్‌ను పుష్ప రాజ్ కోసం డీ గ్లామర్‌గా మార్చేశారు సుకుమార్. అల్లు అర్జున్ ఇలాంటి పాత్ర చేస్తున్నాడంటే మొదట్లో ఆయన ఫ్యాన్స్ అంతా ఫీల్ అయ్యారు. కానీ సుకుమార్ టేకింగ్ మీద ఉన్న నమ్మకంతో వేచిచూశారు. పుష్ప నుండి అల్లు అర్జున్ గ్లింప్స్ విడుదలయిన దగ్గర నుండి దీని మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
పుష్పలో పాటలు కూడా అందరినీ బాగానే ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లీ పాటను అయితే మ్యూజిక్ లవర్స లూప్ మోడ్‌లో వింటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జంటగా నటిస్తున్న రష్మిక కూడా తన లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్పకు ఒక కొత్త సమస్య వచ్చిందట.
అల్లు అర్జున్‌కు నార్త్‌లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది కాబట్టి బన్నీ నార్త్ ఫ్యాన్స్ కోసం పుష్పను హిందీలో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. కానీ పలు సమస్యల వల్ల పుష్ప హిందీ వర్షన్‌ను థియేటర్‌లో రిలీజ్ చేసే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎలాగైనా ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలనుకున్న మూవీ టీమ్.. దీని హిందీ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉందట. ఇది తెలిసిన బన్నీ నార్త్ ఫ్యాన్స్ అప్పుడే డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com