Pushpa Item Song : సమంత ఐటెం సాంగ్ పై పురుషుల సంఘం కేసు..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ సినిమా పైన అంచనాలను భారీ స్థాయిని పెంచగా సమంత ఐటెం సాంగ్ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. 'ఊ అంటావా, ఊఊ అంటావా' అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. చంద్రబోస్ ఈ పాటను రాయగా, ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు.
అయితే ఈ పాట పైన ఆంధ్రప్రదేశ్ లోని పురుషుల సంఘం కేసు పెట్టింది. మగవాళ్ళు కేవలం కామంతోనే ఉంటారన్న మీనింగ్ వచ్చేలా ఆ పాట ఉందని, ఆ పదాలతో అలాంటి భావమే వస్తోందని ఆ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాటను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కోర్టులో 'పురుషుల సంఘం' డిమాండ్ చేసింది. అయితే కోర్టులో ఇంకా కేసు పరిష్కారం కాలేదు. కాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
RELATED STORIES
Cuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..
10 Aug 2022 4:21 PM GMTRussia Ukraine War : రష్యా దాడిలో మరో 13 మంది ఉక్రెయిణిలు మృతి..
10 Aug 2022 3:59 PM GMTLangya Virus : చైనాలో మరో కొత్త వైరస్.. 'లాంగ్యా హెనిపా'.. ఎలాంటి...
10 Aug 2022 3:42 PM GMTChina Taiwan War : మాటవినకుంటే దాడితప్పదని తైవాన్‌కు చైనా వార్నింగ్..
10 Aug 2022 3:23 PM GMTPakistan: ప్రెగ్నెంట్ అని చూడకుండా కాలితో తన్నిన సెక్యూరిటీ గార్డ్..
10 Aug 2022 3:03 AM GMTDonald Trump: ట్రంప్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ తనిఖీలు.. అదే అనుమానంతో..
9 Aug 2022 1:50 PM GMT