సినిమా

Allu Arjun Pushpa: 'పుష్ప'లో అల్లు అర్జున్ కి మదర్ గా నటించింది ఈమె.. ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి

Allu Arjun Pushpa: తనకు పుష్సలో ఎలా అవకాశం వచ్చింది చెప్పిన కల్పలత.. ఆడిషన్‌కి ఎంతో మంది వచ్చారు..

Allu Arjun Pushpa: పుష్పలో అల్లు అర్జున్ కి మదర్ గా నటించింది ఈమె.. ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి
X

Allu Arjun Pushpa: హీరోకి అమ్మగా చేయడం అంటే ఎంత అదృష్టం ఉండాలి.. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి.. అవకాశం రావాలే గానీ అలాంటి టాప్ హీరోలకు అత్తగా, అమ్మగా చేయడానికి ఆర్టిస్టులు క్యూ కట్టేయరూ.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో అమ్మగా నటించిన కల్పలత గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరామె.. ఎక్కడి నుంచి వచ్చారు.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

తనకు పుష్సలో ఎలా అవకాశం వచ్చింది చెప్పిన కల్పలత.. ఆడిషన్‌కి ఎంతో మంది వచ్చారు.. నాకంటే బాగా చేసిన వాళ్లు కూడా ఉన్నారు.. చిత్తూరు యాసలో మాట్లాడడం కష్టమే.. అయినా ప్రయత్నించాలనుకున్నా.. నాకే ఆ క్యారెక్టర్ చేసే అవకాశం రావాలని బలంగా కోరుకున్నా.. వస్తుందా రాదో అని ఎంతో టెన్షన్ పడ్డాను..

ఆడిషన్ ఇచ్చిన ఆరు నెలల తరువాత ఫోన్ వచ్చింది.. దాంతో ఇది నిజమా కలా అని అనుకున్నాను.. ఇంతకీ ఏం క్యారెక్టర్ ఇచ్చారో తెలియదు.. ఫోన్ చేసి మళ్లీ అడిగాను.. దానికి అటునుంచి మీరు ఆడిషన్స్ ఏం క్యారెక్టర్ చేశారు అని అన్నారు.. మదర్ క్యారెక్టర్ చేశాను సార్ అంటే.. మరి అదే క్యారెక్టర్ అల్లు అర్జున్‌కి తల్లి పాత్ర అన్నారు. దాంతో నా ఆనందానికి అవధులు లేవు..

ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే సుకుమార్ గారి సినిమాలో నటించడం మరో ఎత్తు. ఈ సినిమా చేసిన తరువాత సుకుమార్ నాకు అమ్మగా, అల్లు అర్జున్ కొడుకుగా అనిపించారు అని సంతోషంతో చెప్పుకొచ్చారు లత.

ఖమ్మం జిల్లా మణుగూరులో పుట్టి పెరిగిన లతకు చిన్న వయసులోనే పెళ్లైంది. వ్యవసాయదారుల ఫ్యామిలీ.. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న సమయంలో సినిమాల్లో, సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్స్‌లో చాలా సీరియల్స్ చేశారు. ఎక్ప్‌ప్రెప్ రాజా, నేనే రాజు నేనే మంత్రి, అర్జున్ రెడ్డి, భాగమతి, హిట్, వివాహ భోజనంబు, గల్లీ రౌడి, బాహుబలి వంటి హిట్ మూవీస్‌లో నటించినా ఆమె పేరు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ తాజాగా వచ్చిన పుష్పతో కల్పలత పేరు మార్మోగిపోతోంది..

అల్లు అర్జున్‌ని అమ్మగా నటించి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ఉందని చెప్పారు. కొడుకులు లేని లోటు కూడా ఈ చిత్రంలోని పాత్రతో తీరిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి నా పాత్ర గురించి చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పుష్ప ది రూల్‌ ఇంకా బావుంటుందని అన్నారు కల్పలత.

మీ అమ్మకన్నా తెలుసారా.. నువ్వు ఎవరికి పుట్టావో అని అన్నప్పుడు షూటింగ్ చూస్తున్నవాళ్లందరికీ కళ్లలో నీళ్లు వచ్చాయి. మొదటి భాగమే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే సెకండ్ పార్ట్ ఇంకా బావుంటుంది అని అన్నారు కల్పలత.

Next Story

RELATED STORIES