Pushpa Movie: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అని వార్నింగ్ ఇస్తున్న పుష్ప..

Pushpa Movie (tv5news.in)
Pushpa Movie: సినిమా విడుదల దాదాపు రెండు నెలలు ఉంది అన్నప్పుడే మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేస్తుంది. అయితే పుష్ప రిలీజ్‌కు ఇంకా నెలరోజులే గడువు ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇన్నిరోజులు పుష్ప హిందీ వర్షన్ విడుదల చిక్కుల్లో పడడంతో సుకుమార్ కాస్త స్లో అయ్యాడు. ఇప్పుడు ఆ సమస్య కూడా క్లియర్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ పాటలను అందిస్తూ పుష్ప మ్యూజిక్ మ్యానియాను ప్రేక్షకుల్లో నింపుతున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటీనటలు ఫస్ట్ లుక్స్‌తో సహా అన్నింటిని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఇక పాటల విషయంలో కూడా తన ఫ్రెండ్ డీఎస్‌పీ పుష్పకు మంచి మ్యూజిక్‌నే అందించినట్టు తెలుస్తోంది.
తాజాగా పుష్ప నుండి ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా పాటను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాట విడుదల ఉదయం 11 గంటలకు ప్లాన్ చేసినా.. టెక్నికల్ సమస్యల వల్ల కాస్త ఆలస్యం అయ్యి సాయంత్రానికి ప్రోమో సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు వందమంది డ్యాన్సర్లతో ఈ పాట చిత్రీకరించబడింది. దాక్కో దాక్కో మేక లాగానే ఇందులో కూడా బన్నీ తన డ్యాన్స్‌తో మ్యాజిక్ చేయనున్నట్టుగా తెలుస్తోంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com