Pushpa Movie Review: 'పుష్ప' మూవీ రివ్యూ.. సినిమాకు పెద్ద ప్లస్ ఇదే..

Pushpa Movie Review (tv5news.in)

Pushpa Movie Review (tv5news.in)

Pushpa Movie Review: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య.. అల్లు అర్జున్ ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచేసింది.

Pushpa Movie Review: చిత్రం: పుష్ప ది రైజ్.. నటీ నటులు : అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్, అజయ్, అజయ్ ఘోష్, తదితరులు: సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాసన్, రుబెన్, సినిమాటో‌గ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెక్; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముంత్తంశెట్టి మీడియా; నిర్మాత: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్; రచన్, దర్శకత్వం: సుకుమార్; విడుదల: 17-12-2021

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య.. అల్లు అర్జున్ ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచేసింది. ఆ సినిమా బాక్సా‌ఫీస్ హిట్‌గా నిలిచింది.. అయితే ఆ నెక్ట్స్ వచ్చిన ఆర్య 2లో అల్లు అర్జున్ మరింత స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. అందుకే పుష్పపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. స్టైలిష్ స్టార్ బన్నీని ఊరమాస్‌ లుక్‌లో 'పుష్ప'గా పరిచయం చేసిన తర్వాత అంచనాలు రెట్టింపయ్యాయి. ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్, డీగ్లామర్ పాత్రలో రష్మిక కనిపించడంతో సినిమాపై ఆసక్తి కలిగించింది. కామెడీ హీరో సునీల్ కరడు గట్టిన విలన్ మంగళం శ్రీను పాత్రలో కనిపించగా, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

కథ విషయానికి వస్తే..

పుష్ప అలియాస్ పుష్పరాజ్ ఓ కూలీ. ఎవరికీ భయపడని మనస్తత్యం. పని చేసే చోట పరిచయమైన స్నేహితుడి వల్ల అతడి ప్రయాణం మారిపోతుంది. కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదుగుతాడు. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్‌ల సిండికేట్‌లో భాగస్వామిగా, తర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు. తన స్థానాన్ని లాక్కుంటున్నాడని మంగళం శ్రీను (సునీల్)కి పుష్పతో శత్రుత్వం ఏర్పడుతుంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నందుకు పుష్పరాజ్‌ను పట్టుకునే భన్వర్ సింగ్ షెకావత్‌ అనే పోలీస్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ దిగుతాడు. మంగళం శ్రీను భార్యగా, దాక్షాయణిగా అనసూయ కనిపించింది.

నటీనటుల విషయానికొస్తే..

అల్లు అర్జున్.. వన్ మ్యాన్ షో. పుష్ప సినిమా చూసిన ఎవ్వరైనా ముందు ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే అల్లు అర్జున్.. మాస్, ఊరమాస్ పాత్రలు కూడా చేయగలడని పుష్పతో నిరూపించుకున్నాడు. మామూలుగా కమర్షియల్ సినిమాలంటే హీరోయిన్ పాత్రలు పాటల వరకే పరిమితమవుతాయి. కానీ ఇందులో రష్మిక మాత్రం నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలోనే కనిపించి మెప్పించింది. కమెడియన్‌గా, హీరోగా మనం సునీల్‌ను ఎన్నో సినిమాల్లో చూశాం. ఇప్పుడిప్పుడే విలన్‌గా చూడడానికి అలవాటు పడుతున్నాం. పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునీల్‌ను చూసిన తర్వాత తాను ఒకప్పుడు కమెడియన్ అన్న విషయం కూడా మర్చిపోయే అవకాశం ఉంది. తన భార్య దాక్షాయణిగా అనసూయ తనలోని నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఫాహద్ ఫాజిల్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

ప్లస్ పాయింట్స్..

అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్

స్లాంగ్ ప‌ట్టుకోవ‌డంలో నటీనటులు స‌క్సెస్ అయ్యారు

అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్

ఒక కూలిగా మొద‌లై.. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ గ్యాంగ్‌కు లీడర్‌గా ఎదిగే కుర్రాడి కథ ఆకట్టుకుంటుంది

పాట‌లు బాగున్నాయి

శ్రీవ‌ల్లి.. నా సామి పాట‌ల పిక్చరైజేషన్ బాగుంది

స‌మంత ఐటెమ్ సాంగ్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంది

సునీల్.. మంగళం శ్రీను పాత్రలో జీవించాడు

పుష్పలో సెంటిమెంట్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది

మైనస్ పాయింట్స్..

మ‌లయాళ న‌టుడు ఫాహాద్ ఫాజిల్ పాత్ర అనుకున్నంతగా లేదు

సెకండ్ హాఫ్ కొంచెం వేగం మంద‌గించింది

సీన్స్ లో డెప్త్ క‌న‌ప‌డ‌లేదు

బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండే అవకాశం ఉంది

పుష్ప మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్

Tags

Read MoreRead Less
Next Story