Pushpa Movie: 'పుష్ప' టీమ్‌కు బన్నీ ఖరీదైన బహుమతులు..

Pushpa Movie (tv5news.in)
Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్.. వీరిద్దరి మధ్య స్నేహం ఇప్పటిది కాదు.. 'ఆర్య' సినిమాతోనే మొదలయ్యింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, పుష్ప స్క్రిప్ట్‌పై బన్నీకి ఉన్న నమ్మకం కలిసి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లగలిగాయి. ఎప్పుడూ స్టైలిష్‌గా, కూల్‌గా కనిపించే బన్నీ ఈ సినిమా కోసం డీ గ్లామర్ రోల్‌లో కనిపించనున్నారు. అంతే కాక పుష్ప ఔట్‌పుట్‌తో బన్నీ చాలా హ్యాపీగా ఉన్నారట. అందుకే టీమ్‌లోని పదిమందికి చాలా ఖరీదైన గిఫ్ట్‌ను అందించినట్టు సమాచారం.
పుష్ప సినిమాలో అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉన్నాయి. అందులో ఒకటి ఇందులో సమంత స్పెషల్ సాంగ్ చేయడం. సమంత ఇప్పటివరకు ఏ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేయలేదు. అలాంటిది పుష్ప లాంటి ఒక మాస్ సినిమాలో.. ఒక మాస్ బీట్‌ను చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. పైగా ఈ పాట కోసం సమంత కేటాయించింది కేవలం అయిదు కాల్‌షీట్సేనట. ఈ అయిదు రోజుల్లోనే పాటను చకచకా పూర్తి చేసేసింది మూవీ టీమ్.
సమంత స్పెషల్ సాంగ్‌ను అనుకున్న సమయంలో, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తి చేయడం అల్లు అర్జున్‌ను చాలా ఇంప్రెస్ చేసిందట. అందుకే పుష్ప టీమ్‌లోని 12 మందికి 10 గ్రాముల గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్ ఇచ్చారట బన్నీ. డిసెంబర్ 17న పుష్ప సినిమా విడుదల సిద్ధం అయ్యింది. ఈ ఔట్‌పుట్‌కు అల్లు అర్జున్ ఎందుకు ఇంప్రెస్ అయ్యాడో ప్రేక్షకులకు ఆరోజు అర్థంకానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com