Pushpa First Day Collection: ఓపెనింగ్స్‌లో ఫైర్ చూపించిన పుష్పరాజ్..

Pushpa First Day Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్, ఓవర్సీస్ పబ్లిక్ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా ది బెస్ట్ ఫిలిం అవుతుందని అంటున్నారు ప్రేక్షకులు.
అల్లు అర్జున్ కెరీర్‌లోనే మొదటి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్ల విషయంలో కూడా దూసుకెళ్తోంది. ఓపెనింగ్స్ విషంలోనే పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అని తేల్చేసింది. భారతదేంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా పుష్ప బాగానే కలెక్ట్ చేసిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్.
ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే పుష్ప రూ.40 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిందట. ఇందులో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.30 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూ. 5 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ.5 కోట్లు కలెక్షన్లను సాధించింది పుష్ప. అయితే మిగతా భాషలతో పోలిస్తే పుష్ప హిందీ కలెక్షన్స్ వీక్‌గా ఉన్నాయని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com