Pushpa The Rise: 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన అయాన్, అర్హ..

Pushpa The Rise: 'పుష్ప ది రైజ్' సినిమాకు హైప్ మామూలుగా లేదు. మిగతా పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే 'పుష్ప' ప్రమోషన్స్ ఇంకా సరిగ్గా మొదలవ్వకపోయినా.. ప్రేక్షకులకు మాత్రం పుష్పపై భారీ అంచానలే ఉన్నాయి. అందుకే రిలీజ్‌కు వారం కూడా లేక ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది టీమ్. గ్రాండ్‌గా జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు టాలీవుడ్ దర్శకులు చీఫ్ గెస్ట్‌లుగా వచ్చారు.
రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు లాంటి పలువురు హిట్ దర్శకులు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. పుష్ప సినిమాకు వెన్నుముకలాగా వ్యవహరించిన సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం ఈవెంట్‌కు హాజరు కాలేకపోయారు. ఈవెంట్ స్పెషల్‌గా పలు పాటల ప్రోమోలను విడుదల చేసింది మూవీ టీమ్.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ వచ్చిన కాసేపటికే అల్లు అయాన్, అర్హ కూడా వచ్చి తనకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈవెంట్‌కు రావద్దు అని చెప్పినా వినకుండా వచ్చారని హోస్ట్ సుమ అన్నారు. వారు స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత అర్హ.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషెన్స్‌తో తగ్గేదే లే అని డైలాగ్ చెప్పి బన్నీ ఫ్యాన్స్‌ను హ్యపీ చేసింది. ఆ తర్వాత రష్మిక కూడా సామి సామి పాటకు రెండు స్టెప్పులేశారు. అలా సరదాగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com