Pushpa Item Song: 'పుష్ప' స్పెషల్ సాంగ్ కోసం ఒకరు కాదు ముగ్గురు హీరోయిన్లు..

Pushpa Item Song: పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల విడుదలయిన సమంత స్పెషల్ సాంగ్.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా' అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్.. యూత్‌ను వెంటనే ఆకర్షించింది. అందుకే యూట్యూబ్‌లో ఈ లిరికల్ సాంగ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ పాట తమిళ, మలయాళ వర్షన్స్‌ను అక్కడి ప్రేక్షకులకు దగ్గర చేయడానికి డీఎస్‌పీ సూపర్ ప్లాన్ వేశారు.
భారీ బడ్జెట్‌తో, డిఫరెంట్ కథతో పుష్పను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఏ ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేరని టాక్. ఇప్పటివరకు ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకోని సమంతను పుష్పలో స్పె్షల్ సాంగ్ కోసం ఒప్పించారు. అదే ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.
పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న పుష్పకు ప్రతీ భాషలో హైప్ తీసుకురావడానికి మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది. అందుకే ట్రైలర్‌ను, పాటలను ప్రతీ భాషలో స్పెషల్‌గా విడుదల చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. స్పెషల్ సాంగ్‌కు కూడా అదే ఫార్ములాను ఉపయోగించారు. అయితే ఈ స్పెషల్ సాంగ్‌ను తెలుగులో ఇంద్రావతి చౌహన్ పాడగా.. తమిళంలో నటి ఆండ్రియా జెరెమియా, మలయాళంలో రమ్య నంబీసన్ పాడారు.
ఆండ్రియా.. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా పలు హిట్స్‌ను అందించారు. ఇంతకు ముందు కూడా దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో ఆండ్రియా కొన్ని సాంగ్స్‌ను పాడారు. ఇక మలయాళంలో రమ్య నంబీసన్ ఈ పాటను ఆలపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు హీరోయిన్‌గానే రాణిస్తున్న రమ్య సింగర్‌గా ఓ స్పెషల్ సాంగ్ పాడడం ప్రేక్షకులనే ఆకర్షించే అంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com