Pushparaj : నాలుగు రోజుల్లో పుష్ప 2 విధ్వంసం

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప 2 టాక్ తో సంబందం లేకుండా బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కాస్త స్లోగా ఉన్నా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం అదరగొడుతోంది. నార్త్ తో పాటు ఓవర్శీస్ లో కూడా పుష్పరాజ్ కలెక్షన్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ నెల 5న విడుదలైన పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే 294 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో 72 కోట్లతో ఫస్ట్ డే రికార్డ్, ఆ తర్వాతి రోజు 74 కోట్లతో శనివారం ఏకంగా 84 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ ఆల్ టైమ్ బెంచ్ మార్క్ ను సెట్ చేసిందీ మూవీ. ఇక ఆదివారం రోజు అన్ని భాషల్లోనూ విపరీతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం 145 కోట్లకు పైగా వసూలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లోనే పుష్ప 2 మూవీ 800 కోట్లు వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకైనా ఇదే ఫాస్టెస్ట్ 800 కోట్ల కలెక్షన్స్. అంతా ఊహించినట్టుగానే ఈ మూవీ ఈజీగా 15 కోట్లు వసూలు చేస్తుందంటున్నారు. కాకపోతే ఈ సోమవారం నుంచి పర్ఫార్మ్ చేసేదాన్ని బట్టి అది ఉంటుంది. పైగా సోమవారం నుంచి అన్ని రాష్ట్రాల్లో టికెట్ రేట్లు తగ్గుతున్నాయి. అందువల్ల కలెక్షన్స్ పరంగా ఇంత దూకుడు ఇక కనిపించకపోవచ్చు. బట్ లాంగ్ రన్ లో మాత్రం దాదాపు అందరికీ లాభాలు తీసుకురావడం గ్యారెంటీ అనుకోవచ్చు.
ఇక కథ పరంగా అద్భుతం అనిపించుకోకపోయినా.. ఒక ఏడెనిమిది సీక్వెన్స్ అదిరిపోయాయి. పుష్ప 2 విజయానికి అదే కారణం. లెంగ్త్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే కొన్ని విమర్శలు కూడా తగ్గేవి. బట్ అస్సలు తగ్గేదే లే అన్నట్టుగా కనిపించాడు సుకుమార్. పాటలు హిట్ అయ్యాయి. రష్మిక గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ మార్కులు కొట్టేసింది. ప్రతి ఫ్రేమ్ లోనూ అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కనిపించింది. ఫహాద్ ఫాజిల్ పాత్ర తేలిపోయింది. బలమైన విలన్ లేకపోవడం మైనస్ గా కనిపించినా.. పుష్ప 2 ఈ రేంజ్ లో ఉందంటే బలమైన కథ, కథనాలు కూడా పడి ఉంటే ఇంక ఏ రేంజ్ లో ఉండేదో అంచనా వేయొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com