Raadhika Sarathkumar: 'మా తండ్రి వివాదాస్పదమైన వ్యక్తి.. ఎంజీఆర్‌తో జరిగిన కాల్పుల ఘటనను..': రాధిక

Raadhika Sarathkumar: ఒకప్పటి హీరోయిన్లలో రాధిక శరత్ కుమార్‌కు ఉన్న క్రేజే వేరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి.. ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది రాధిక. అంతే కాకుండా చాలాకాలం వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. అయితే చాలాకాలంగా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న రాధిక.. ఇటీవల ఓ కాంట్రవర్షియల్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తమిళ నటుడు ఎం.ఆర్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రాధిక. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి కేవలం బుల్లితెరకే పరిమితమయ్యారు. కానీ కొన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయిపోయారు. రాధిక తెలుగులో చివరిగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రంలో కనిపించారు. ఇటీవల ఓ షోకు గెస్ట్‌గా హాజరయిన రాధిక.. పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
రాధిక తండ్రి ఎం.ఆర్ రాధా కోలీవుడ్‌లో హీరోగానే కాదు విలన్‌గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయనకు, ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంజీఆర్‌కు మధ్య ఏవో గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో ఇదే కోలీవుడ్‌లో హాట్ టాపిక్. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఒకసారి కాల్పులు కూడా జరిగాయి. ఈ విషయంపై రాధిక స్పందించింది.
తన తండ్రి వివాదాస్పదమైన వ్యక్తి అని తెలిసిన విషయమే అని, అప్పట్లో ఆయనకు, ఎంజీఆర్ ఏవో గొడవలు జరుగుతూ ఉండేవి అన్నారు రాధిక. వారిద్దరి మధ్య జరిగిన కాల్పుల ఘటన గురించి అందరికీ తెలిసిందే అని మరోసారి దాని గురించి గుర్తుచేశారు. అయితే ఈ ఘటనను త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌గా తెరకెక్కించనుందట రాధిక. ప్రస్తుతం ఆ సిరీస్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com