Raashi Khanna: మదర్స్ డే నాడు తల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన రాశి ఖన్నా..

Raashi Khanna: మదర్స్ డే సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు వారి తల్లితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా మరికొందరు వారి కోసం ఎమోషనల్ క్యాప్షన్స్‌ను కూడా జతచేశారు. కానీ రాశి ఖన్నా మాత్రం తన తల్లి కోసం ఓ కాస్ట్‌లీ బహుమతిని ఇచ్చింది. దాని ధర తెలిసిన వాళ్లంతా అది చూసి ఆశ్చర్యపోతున్నారు.
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వగానే రాశి ఖన్నా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాకుండా కొన్నాళ్ల పాటు రాశి టాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది. కానీ మెల్లగా తను నటించిన సినిమాలు ఆశించినంత రేంజ్‌లో హిట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం రాశి బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ ఒకట్రెండు సినిమాలతో తాను బిజీగా ఉంది.
లగ్జరీ కార్లలో ఒకటైన బీఎండబ్ల్యూను తన తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చింది రాశి ఖన్నా. మామూలుగానే బీఎండబ్ల్యూ అంటే దాని ధర ఎంత ఉంటుందో అంచనా వేయగలం. అయితే రాశి ఖన్నా తీసుకున్న మోడల్ విలువ రూ. 1.40 కోట్లని సమాచారం. ఇక రాశి తన తల్లికి ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఈ కారు కొనుగోలు చేసినప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com