Raashi Khanna : లండన్ వీధుల్లో అందాల రాశి

Raashi Khanna : లండన్ వీధుల్లో అందాల రాశి
X

హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తోంది రాశిఖన్నా. ‘మద్రాస్ కేఫ్​​​’ మూవీతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ఢిల్లీ భామ . 2014లో అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆ మూవీ హిట్ కావడంతో రాశిఖన్నాకు తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి. జోరు, సుప్రీం, జిల్, శివం, బెంగాల్ టైగర్, హైపర్, జై లవకుశ, తొలిప్రేమ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, వెంకీమామ, ప్రతిరోజు పండుగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్​ లోనూ రాశి నటించింది. అయితే, ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా రాశిఖన్నాకు టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చోటు దక్కలేదు. ఆ మధ్యలో అమెజాన్ ప్రైమ్ లో ‘ఫర్జీ’పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ లో నటించిన రాశిఖన్నా.. నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాటు హాట్ స్టార్ లో ‘రుద్ర’ వెబ్ సిరీస్ లోనూ ఆమె యాక్ట్ చేసింది. ఈ రెండు వెబ్ సిరీల తర్వాత బాలీవుడ్ లోనూ రాశిఖన్నా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించినా బాక్సాఫీసును షేక్ చేసే సాలిడ్ హిట్ ఆమెకు పడలేదు. గతేడాది తమిళ్​ లో వచ్చిన అరణ్మయి4తో రాశి ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టాలీవుడ్ టిల్లూ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న ‘తెలుసు కదా’ సినిమాలో రాశిఖన్నా నటిస్తోంది.దీంతో బాలీవుడ్ మూవీ ‘సబర్మతి రిపోర్ట్’లోనూ ఆమె యాక్ట్ చేస్తోంది. వీటితో పాటు ఓ హిందీ, తమిళ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం లండన్ లో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న రాశిఖన్నా.. ఇన్ స్టాగ్రామ్​ లో ఆ ఫొటోలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Tags

Next Story