Dushara Vijayan : సెగలు రేపుతున్న దుషారా

ఇవాళా రేపు ఇమేజ్ మార్చుకోవాలంటే ఒక్క ఫోటో షూట్ చాలు. ఇదుగో ఈ ఫోటోస్ లో కనిపిస్తోన్న బ్యూటీని గుర్తుపట్టారా..? యస్.. దుషారా విజయన్. రీసెంట్ గా వచ్చిన రాయన్ మూవీలో ధనుష్ కు చెల్లిగా నటించింది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటించిన వేట్టైయాన్ లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే అమ్మడి స్క్రీన్ ఇమేజ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికే ఈ ప్రయత్నాలు అంటున్నారు నెటిజన్స్.
తనలోనూ గ్లామర్ యాంగిల్ ఉందని.. ఆ విషయంపైనా దృష్టి పెట్టాలని మేకర్స్ కు హింట్ ఇస్తున్నట్టుగా ఉందీ ఫోటో షూట్ అంటున్నారు. నిజానికి రాయన్ రిలీజ్ టైమ్ లో కూడా అమ్మడు ఏకంగా బికినీ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ టైమ్ లో అవన్నీ వైరల్ గా మారాయి. అరే రాయన్ లో కనిపిచింది తనేనా అనుకున్నారు ఆడియన్స్. ఆ రేంజ్ లో అందాలారబోసింది.
ఇదుగో ఇప్పుడు మరోసారి ఇలా రెచ్చిపోయింది. దుషారా కెరీర్ ఆరంభం నుంచి డీ గ్లామర్ రోల్సే ఎక్కువగా వస్తున్నాయి. పా. రంజిత్ తెరకెక్కించిన సార్పట్టై పరంపరలో పూర్తిగా డీ గ్లామర్ రోల్. లేదంటే కాస్త ఎక్కువ హుందాగా కనిపించే పాత్రలే చేస్తోంది. అందుకే బోర్ కొట్టిందేమో.. ఇలా తనలోని డిఫరెంట్ యాంగిల్స్ ను చూపిస్తూ రెచ్చగొడుతోంది.
అయినా హీరోయిన్ అన్న తర్వాత అన్ని రకాల పాత్రలూ చేయాలి. అసలు గ్లామర్ రోల్స్ చేస్తేనే కదా మాస్ లో ఫాలోయింగ్ వచ్చేది. కాస్త ఇమేజ్ కూడా పెరిగేది. అలాగే కెరీర్ స్పాన్ పెరగాలన్నా టాలెంట్ తో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేస్తాను అనే క్లారిటీ ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అలాగని కేవలం గ్లామర్ కురిపించడమే పనిగా పెట్టుకోదు కదా.. ఎలాగూ మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకుంది. మేకర్స్ ఆ విషయంలోనూ క్లారిటీనే ఉంటారు. సో.. దుషారా హాట్ హాట్ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com