Sandeep Kishan : రాయన్.. సందీప్ కిషన్ కు ప్లస్సా మైనస్సా..

Sandeep Kishan : రాయన్.. సందీప్ కిషన్ కు ప్లస్సా మైనస్సా..
X

వెరీ టాలెంటెడ్ అనిపించుకున్నా అదృష్టం లేక నెక్ట్స్ లీగ్ లోకి ఎంటర్ కాలేకపోయిన హీరో సందీప్ కిషన్. ఓ సాలిడ్ హిట్ కోసం అనేక కథలు ప్రయత్నించాడు. కానీ ఏదీ పెద్దగా కలిసి రాలేదు. అప్పుడప్పుడూ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ కూడా ట్రై చేశాడు. అవీ అంతే అయిపోయాయి. బట్ నటుడుగా అతనెప్పుడూ ఫెయిల్ కాలేదు. కాకపోత ప్రతిభకు అదృష్టం తోడైతేనే కదా స్టార్డమ్ దక్కేది..? ఈ విషయంలో సందీప్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో రాయన్ పడింది. ధనుష్ డైరెక్షన్ లో అతను షైన్ అయ్యాడు. ఈ మూవీలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ సందీప్ పాత్రతోనే ఉంటుంది. మంచి టాలెంటెడ్ కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నాడు. నటనతో మెప్పించాడు. సందీప్ మనకంటే ఎక్కువగా తమిళ్ ఆడియన్స్ కే ఫేవరెట్. అందుకే అక్కడా అతనికి అద్బుతమైన అప్లాజ్ వస్తోంది. అయితే ఈ పాత్ర అతని కెరీర్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఖచ్చితంగా అతన్ని సెంటర్ పాయింట్ లో పెడుతుందనే చెప్పాలి.

ఒకప్పుడు కన్నింగ్ క్యారెక్టర్స్ చేయడానికి సెపరేట్ ఆర్టిస్ట్ లు ఉండేవారు. వారి పాత్రలు ఎంతో బాగా ఉన్నా.. చివరికి ఎవరికో ఒకరికి ద్రోహం చేసే పాత్రలతో ఎలివేట్ అయ్యారు. ఈ తరంలో అలాంటి పాత్రల్లో మెప్పించే నటులు అరుదుగా ఉన్నారు. అలాంటి ఛాన్స్ సందీప్ కు వచ్చింది. ఉపయోగించుకున్నాడు. అందుకే ఇకపై ఈ తరహా పాత్రలే ఎక్కువగా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడెలాగూ అంతా క్యారెక్టర్ లో దమ్మునే చూస్తున్నారు. అందుకే పది నిమిషాలే అయినా విలన్ గా నటించేందుకు సూర్య లాంటి టాప్ స్టార్ విక్రమ్ లో ఒప్పుకున్నాడు. మరీ అంత చిన్న పాత్రలు కాదు కానీ.. బలమైన విలన్ గా మెప్పించే అవకాశం సందీప్ కు ఉంది.

ఎలాగూ హీరోగా విజయాలు లేవు కాబట్టి.. విలన్ గా అవకాశాలు వస్తే చేయడమే బెటర్ అవుతుంది. అప్పుడప్పుడూ హీరోగా చేసినా యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి ఇదీ వర్కవుట్ అవుతుంది. సో.. రాయన్ మూవీలో ముత్తువేల్ పాత్ర సందీప్ ను సెంటర్ పాయింట్ లో నిలబెట్టే అవకాశాలున్నాయి. అక్కడ నుంచి విలన్ అయినా.. హీరో అయినా చేసుకునే ఛాన్స్ ఉంది. మరి అతని స్టెప్పులు ఎటు వేపు ఉంటాయో చూడాలి.

Tags

Next Story