Pooja Hegde Birthday: వైట్ డ్రెస్‌లో నెమలిలా పూజా.. రాధే శ్యామ్‌లో ప్రేరణగా..

pooja hegde (tv5news.in)
Pooja Hegde Birthday: సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయిన కొద్దికాలంలోనే గోల్డెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. అఖిల్‌తో కలిసి తాను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల దగ్గర పడుతుండడంతో ఈ సినిమా గురించి విశేషాలు అభిమానులతో పంచుకుంది పూజా.
ఇప్పటివరకు ఇలాంటి ఒక ఎనర్జిటిక్ క్యారెక్టర్ తాను చేయలేదని పూజా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది. తాను ఇందులో స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నానని, దానికోసం తాను ప్రత్యేకంగా సిద్ధమయ్యానని అన్నారు పూజా. ఇందులో విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. ఈరోజు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్‌తో తాను చేస్తున్న రాధే శ్యామ్ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com