Radhe Shyam Teaser: రాధే శ్యామ్ టీజర్‌లో ఎవరూ గమనించని విక్రమాదిత్య సీక్రెట్..

Radhe Shyam Teaser (tv5news.in)
Radhe Shyam Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎంతో ఎదురుచూస్తున్న తన తరువాతి సినిమా రాధూ శ్యామ్ టీజర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. సినిమా షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి పోస్టర్లతోనే సరిపెడుతున్న మూవీ టీమ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చింది. ఒక ఈ టీజర్‌లోని ఒక ఫ్రేమ్‌లో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటపడింది.
'నేను దేవుడిని కాదు.. అలా అని మీలో ఒకడినీ కాదు' అని రాధే శ్యామ్ టీజర్‌లో అన్నాడు ప్రభాస్. దీన్ని బట్టి చూస్తే విక్రమాదిత్య క్యారెక్టర్‌లో కనిపించనున్న ప్రభాస్ ఒక ఆస్ట్రాలజర్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలావరకు ఇదే నిజమని నిర్దారణకు కూడా వచ్చేశారు ప్రేక్షకులు. అయితే అది నిజమే అని టీజర్‌లోని ఒక సీన్ మనకు నిరూపిస్తుంది.
రాధే శ్యామ్ టీజర్‌లో ఒక చోట ప్రభాస్ టేబుల్ కనిపిస్తుంది. దానిపై ఒక మ్యాగజిన్‌పై ప్రభాస్ ఫోటో ఉంటుంది. ఆ మ్యాగజిన్‌పై ఉన్న విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇండియన్ ఎమర్జెన్సీని అంచనా వేసిన వ్యక్తి' అని ప్రభాస్ ఫోటో ఆ మ్యాగజిన్‌పై ప్రభాస్ ఫోటో పబ్లిష్ అయ్యి ఉంది. దీని వల్ల విక్రమాదిత్య ఒక ఆస్ట్రాలజర్ అని, ఇది ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కథ అన్న విషయాలు స్పష్టమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com