Radhikaa Sarathkumar : చిరంజీవితో బ్లాక్‌బస్టర్‌కు రెడీ.. : రాధిక శరత్‌కుమార్

Radhikaa Sarathkumar : వెండితెర పైన మెగాస్టార్ చిరంజీవి, రాధిక సూపర్ హిట్ కాంబినేషన్... మెగాస్టార్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ కూడా ఆమెనే కావడం విశేషం.. ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమాను నిర్మించడానికి రెడీ ఆమె అయిపోయారు.
ఈ విషయాన్ని రాధిక ఆదివారం ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ''త్వరలో మా రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌లో మీరో ప్రాజెక్ట్ చేయడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు. కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో ఓ బ్లాక్‌బస్టర్ తీయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని తెలిపింది.
అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా చిరంజీవితో కలిసి అనేక చిత్రాలలో కలిసి నటించిన రాధిక.. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Thank you dear @KChiruTweets for giving your consent to do a project for #radaan @realsarathkumar In the near future.
— Radikaa Sarathkumar (@realradikaa) May 1, 2022
Looking forward to making a blockbuster with the King of Mass🙏🙏🙏
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com