Kanchana 4 : ఇద్దరు హీరోయిన్లు.. 8 వారాలు.. లారెన్స్ ప్లానింగ్ భలే ఉందిగా

Kanchana 4 :  ఇద్దరు హీరోయిన్లు.. 8 వారాలు.. లారెన్స్ ప్లానింగ్ భలే ఉందిగా
X

కొరియోగ్రాఫర్ గా ఎంత సక్సెస్ అయ్యాడో దర్శకుడుగానూ అంతే సూపర్ సక్సెస్ అయ్యాడు రాఘవ లారెన్స్. మాస్ తో మొదలుపెట్టిన దర్శకత్వంలో ముని మూవీని ఫ్రాంఛైజీగా మార్చాడు. కాంచన పేరుతో రూపొందుతోన్న ఈ ఫ్రాంఛైజీలో 4వ భాగం రెడీ అవుతోంది. అంటే కాంచన 4 అన్నమాట. ఇంతకు ముందు వచ్చిన మూడు భాగాలూ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అన్ని సినిమాల్లోనూ ఇద్దరు హీరోయిన్లు కామన్ గా ఉంటున్నారు. రెండు భాగాల్లో తనే డ్యూయొల్ రోల్ కూడా చేశాడు లారెన్స్. ఇక ఈ సారి కూడా అతను ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేసుకున్నాడు.

పూజాహెగ్డే తోపాటు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని ఫైనల్ చేసుకున్నారు. నోరా ఫతేహి రీసెంట్ గా వరుణ్ తేజ్ మూవీ మట్కాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇప్పుడు కాంచన 4తో కోలీవుడ్ కు పరిచయం అవుతోంది. పూజాహెగ్డే ఆల్రెడీ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి వారం దాటింది. నాన్ స్టాప్ గా చిత్రీకరణ చేస్తాడట లారెన్స్. అలాగే ఇంతకు ముందులా కాకుండా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నాడు. అంటే అతని కాంచన మూవీస్ ఇంతకు ముందు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. కానీ వర్కవుట్ కాలేదు. బట్ ఈ సారి రీమేక్ కు ఛాన్స్ లేకుండా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను ఒకేసారి ఎంటర్టైన్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడన్నమాట.

ఇక ఈ చిత్ర ఓటిటి స్ట్రీమింగ్ కు కూడా టైమ్ లైన్ సెట్ చేసుకున్నాడు లారెన్స్. మూవీ విడుదలైన 8 వారాల తర్వాతే ఓటిటిలో స్ట్రీమ్ అయ్యేలా అగ్రిమెంట్స్ సెట్ చేసుకుంటున్నాడట. అంటే రిలీజ్ తర్వాత రెండు నెలలకు కానీ ఓటిటిలో రాదు. దీన్ని బట్టి ఈ సినిమా రెండు నెలల పాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకంతో లారెన్స్ ఉన్నాడనుకోవచ్చు. ఏదేమైనా హారర్ తోనే కాకుండా మంచి వినోదంతోనూ ఆకట్టుకునే లారెన్స్ ఈ సారైనా టెంప్లేట్ మారుస్తాడా లేక గత చిత్రాల్లానే ఒక పాత్రకు అన్యాయం.. మరో పాత్రతో న్యాయం చేయించడం అనే టెంప్లేట్ తోనే వస్తాడా అనేది చూడాలి.

Tags

Next Story