Jai Bhim: రియల్ లైఫ్ సిన్నతల్లికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చిన రాఘవ లారెన్స్..

Jai Bhim (tv5news.in)
Jai Bhim: కులం, మతం లాంటి సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమా తీయడమంటే అంత మామూలు విషయం కాదు. అలాంటి సినిమాలను ఏ బెదురు లేకుండా తీసి విడుదల చేసిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. అలా విడుదలయ్యి ప్రేక్షకుల చేత ఎంతో ఆదరణ పొందుతున్న సినిమాల్లో జై భీమ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరు బాగుంది అనకుండా ఉండలేకపోతున్నారు.
జై భీమ్ సినిమాలో సూర్య హీరోనే అయినా అందులో కీలక పాత్రలు పోషించిన లిజోమోల్ జోస్, మణికంఠన్ మాత్రం జై భీమ్‌కు రెండు స్ట్రాంగ్ పిల్లర్లలాగా ఉన్నారు. వారు లేకపోతే సినిమానే లేదు అనిపించేలా చేశారు. ముఖ్యంగా సిన్నతల్లి పాత్ర పోషించిన లిజోమోల్ జోస్ తన యాక్టింగ్‌తో అందరినీ కంటతడి పెట్టించింది. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు దీనికి మరింత కనెక్ట్ అయ్యారు.
ఇటీవల జై భీమ్ సినిమాను ఎవరి జీవితకథ ఆధారంగా తెరకెక్కించాడో వారిని అందరికీ పరిచయం చేశాడు దర్శకుడు గ్నానవేల్. రియల్ లైప్‌లో లాయర్ చంద్రును చూసి ప్రేక్షకులు ఎలా గర్వపడ్డారో.. సిన్నతల్లిని చూసి అంతే జాలిపడ్డారు కూడా. అందుకే దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ రియల్ లైఫ్ సిన్నతల్లికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆమెకు సొంత ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చాడు.
రాఘవ లారెన్స్.. సినిమాల్లోనే కాదు బయట కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. ప్రస్తుతం రియల్ లైఫ్ సిన్నతల్లి అంటే పార్వతి పడుతున్న కష్టాలు చూసి లారెన్స్ తనకు ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చారు. సినిమా విడుదల తర్వాత పార్వతికి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. తాను ఎంత పేదరికాన్ని అనుభవిస్తుందో అందరికీ తెలిసింది. అలాగే ఈ విషయం లారెన్స్ వరకు వెళ్లింది. దీంతో తనకు సొంత ఇళ్లు కట్టిస్తానని అధికారికంగా ప్రకటించాడు.
28 ఏళ్ల క్రితం జరిగిన ఒక దీనమైన సంఘటనను ఇప్పటివారికి తెలిసేలా చేసినందుకు జై భీమ్ టీమ్‌కు అభినందనలు తెలిపారు రాఘవ లారెన్స్. లారెన్స్ మంచితనాన్ని చూసి తన అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
A house for Rajakannu's family 🙏🏼 #JaiBhim #Suriya @Suriya_offl @2D_ENTPVTLTD @rajsekarpandian @tjgnan @jbismi14 @valaipechu pic.twitter.com/nJRWHMPeJo
— Raghava Lawrence (@offl_Lawrence) November 8, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com